సంపాదకీయం గెస్ట్ ఎడిటోరియల్

రాజ్యాంగాన్ని, రాజ్యాంగవాదాన్ని విమర్శించకూడదా?

విజయవాడలో ఇటీవల జరిగిన 29 వ మహాసభల సందర్భంగా విరసం ఒక కీనోట్‌ పేపర్‌ను విడుదల చేసింది. దాని శీర్షిక ‘‘ఫాసిస్టు సందర్భంలో రాజ్యాంగవాదం’’. ఆ కీనోట్‌ పేపర్‌ ను కా.పి. వరలక్ష్మి మహాసభల్లో ప్రవేశపెట్టారు. దానిపై మహా సభలు ప్రారంభం కాకముందే చర్చలు మొదలయ్యాయి. ఆ తర్వాతా మౌఖిక, లిఖిత రూపాల్లో అనేక ప్రతిస్పందనలు వెలువడ్డాయి. ఆ ప్రతిస్పందనలలో విరసాన్ని తప్పుపడుతూ ఈ కింది అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.                                                                        విరసం రాజ్యాంగవాదాన్ని విమర్శిస్తున్నదంటే అంబేద్కర్‌ను విమర్శిస్తున్నట్టని, రాజ్యాంగం ద్వారా అందాల్సిన హక్కులు, రక్షణలు దళితులకు, పీడిత సమూహాలకు దక్కకుండా చేసే ఉద్దేశం విరసానికున్నదని కొందరు భావించారు. రాజ్యాంగం
గెస్ట్ ఎడిటోరియల్

ఇథనాల్ వ్యతిరేక ఉద్యమంపై దాడి 

(ప్రాణాంతక ఇథనాల్ కంపెనీ వ్యతిరేక రైతాంగ పోరాటానికి మద్దతుగా , ఆ ఉద్యమం పై రాజ్య హింసను నిరసిస్తూ చిత్తనూరు ఇథనాల్‍ వ్యతిరేక పోరాట కమిటీ పక్షాన రాసిన ఈ కీనోట్ ను ఈ సంచిక సంపాదకీయంగా ప్రచురిస్తున్నాం - వసంత మేఘం టీం) చిత్తనూర్‍, ఎక్లాస్పూర్‍, జిన్నారం గ్రామాలకి చాలాదగ్గరలో ఇథనాల్‍ కంపెనీకి దగ్గర్లో ఎక్లాస్పూర్‍ గేటు దగ్గర రిలే ధర్నాలు జరుగుతున్న శిబిరం ముందు 22.10.2023న ఉదయం పూట రైతాంగంపై పోలీసులు దాడిచేశారు. అధికారులు, రాజకీయ నాయకత్వం మరియు కంపెనీ పక్షాన పోలీసులు చాలా ఆగ్రహంతో దాడిచేశారు. ఇది రైతులు ఊహించని ఘటన. ఎందుకు ఇలా