1943 లో జర్మనీలో జరిగిన యధా తధ సంఘటనల ఆధారంగా రూపొందించిన అద్భుతమైన డాక్యుమెంటరీ “సోఫీ స్కోల్ – ది ఫైనల్ డేస్”. ఈ చిత్ర దర్శకుడు ‘మార్క్ రోథెమండ్’ (Marc Rothemund). దీని వ్యవధి 120 నిమిషాలు. ఇతివృత్తం; 1943 లో, ఫిబ్రవరి 22 న , ‘సోఫీ స్కోల్’ అనే విద్యార్థినిని, ఆమె సోదరుడిని, ఇంకొక సహ నిరసనకారుణ్ణీ యుద్ధ వ్యతిరేక కరపత్రాలు పంచిపెట్టారనే నేరాన్ని మోపి, నాజీ హిట్లర్ ప్రభుత్వం గిలెటిన్ తో శిరఛ్చేదం చేసింది. ఈ శిరఛ్చేదానికి ముందు ముగ్గురికీ నేర విచారణ జరుగుతుంది. ప్రధానంగా మహిళా పాత్ర సోఫీ స్కోల్ దృష్టి