ఎరుకల కథలు

ఎర్రమన్ను, ముగ్గుపిండి

నాగులకుంటలో తెల్లవారింది. మేనపాటి నరసింహులు సైకిల్ బెల్లు గణగణ లాడిస్తూ వీధిలోకి వచ్చాడు. అప్పటికింకా ఉదయం  ఆరు కూడా కాలేదు సమయం.ఎంత బలంగా బెల్లు నొక్కుతున్నా కుడిచేతి  బొటనవేలు నొప్పి పెడుతోంది, కానీ బెల్లు అంతగా మోగడం లేదు. అప్పటికే లేచి తయారైన పిల్లలు అక్కడక్కడా బిగ్గరగా పాఠాలు చదువుకుంటున్న చప్పుడు వినిపిస్తోంది. దినపత్రికలు వేసే కుర్రాళ్ళు ఇద్దరు ఒకరితో ఒకరు పోటీ పడుతూ హుషారుగా నవ్వుకుంటూ  రివ్వున దూసుకు వెడుతున్నారు సైకిళ్ళపైన. తనూ కదులుతూనే వాళ్ళ సైకిళ్ళని తదేకంగా చూస్తూ , తన  సైకిల్ వైపు తలవంచి  పరీక్షగా చూసుకున్నాడు. సైకిల్ మరీ పాతబడిపోయింది. ముందులాగా వేగంగా,
ఎరుకల కథలు

వెదుర్లు

అక్కడ యుద్ధం జరిగినట్లు వుంది. మృత కళేబరాల్లా ఉన్నాయి టమోటా మొక్కలు. సైనికుల దండయాత్రేదో జరిగినట్లుంది. పొలమంతా నానా భీభత్సంగా వుంది.  టమోటాలు చితికిపోయి నలిగిపోయి వున్నాయి. ఎకరా  పొలంలో ఎక్కడా ఒక మొక్క బతకలేదు. ఒక్క టమోటా కూడా మిగల్లేదు. ఎరుకల దొరస్వామి గుండెలవిసేలా ఏడుస్తున్నాడు. పక్కనే అతడి భార్య ఏడో నెల గర్భిణి నీలమ్మ కండ్లల్లో  నీళ్ళు పొంగుతున్నాయి. ఆమె పక్కనే ఆరేళ్ళ కుర్రాడు. రాజు దిక్కుతోచకుండా అమ్మానాన్నల వైపు బిత్తరపోయి చూస్తూ వున్నాడు. ఏం జరిగిందో, టమోటా పంట మొత్తం ఎందుకిట్లా నాశనం అయ్యిందో, అమ్మానాన్న ఎందుకట్లా ఏడుస్తున్నారో వాడికి అస్సలు అర్థం కాలేదు.
ఎరుకల కథలు

చప్పుడు

“శీనుగా టీ తీసుకురా...." వెంకట రెడ్డి కేకేసాడు. ఆ కేకతో శీనుగాడు అనబడే కావాటి గునయ్య శ్రీనివాసులు అనబడే సర్పంచు ఆ ఊరి రెడ్డి గారి ఇంట్లోకి పరుగున వెళ్లాడు. రెడ్డిగారింట్లో హాల్లో ఎంఆర్ఓ, ఎండిఓ, ఇఒఆర్డి, పంచాయతి సెక్రటరి, ఇంకా ఇద్దరు ముగ్గురు ఊరి పెద్దలనబడే  పెద్ద కులాల వాళ్లు కూర్చుని ఉన్నారు. అందరిలోనూ ఏదో దర్పం తొంగిచూస్తోంది. గుమ్మం బయట తలారి నిలబడి హాల్లోకి తొంగిచూస్తున్నాడు.  ఎంతైనా రెడ్డిగారు రెడ్డిగారే. ఆఫీసర్ల ఆఫీసర్లే. జవాను జవానే ఆఖరికి తలారోడూ తలారోడే. ఎటొచ్చి శ్రీనివాసులు మాత్రం శ్రీనివాసులు కాకుండా పోయాడు. సర్పంచు సర్పంచు కాకుండా పోయాడు. ఎందుకంటే
ఎరుకల కథలు

ఏనుగుల రాజ్యంలో

ఊరు మొత్తం  ఒక్కసారిగా  ఉలిక్కిపడింది. ఏనుగులు అడవి దాటి సరాసరి కోటూరు వద్ద పొలాల్లోకి వచ్చేసాయి.ఎన్ని వచ్చాయో ఎవరికీ తెలీదు.  ఎవరూ సరిగ్గా చూడలేదు. అంత సమయం లేదు. పొలాల్లో అక్కడక్కడా  పనులు చేసుకుంటున్న రైతులు అందరూ  పలుగూ పారా కత్తీ, కొడవలి,  తట్టాబుట్టా ఎక్కడవి అక్కడే పడేసి కేకలు పెట్టుకుంటూ ఒకర్ని ఒకరు హెచ్చరించుకుంటూ పరుగుపరుగున ఊర్లోకి వచ్చేశారు. “ ఏనుగులు వచ్చేసాయి, ఏనుగులంట.. గుంపులు గుంపులుగా వచ్చేసాయంట ..” “ ఈ రోజు ఎవురికి మూడిందో ఏమో .. ఎవరి  పంటలు తినేసి, తొక్కేసి పోతాయో  ఏమో ? “  “ముండా ఏనుగులు, మిడిమాలం ఏనుగులు
ఎరుకల కథలు

ధర్నా

"ఇదంతా అయ్యేపని కాదులేన్నా" నిష్ఠూరంగా అన్నాడు గోపాల్. గోపాల్ మాటలకు బదులు చెప్పే ప్రయత్నం చెయ్యలేదు రమణ. అతడికి ముప్పై ఐదేళ్లుంటాయి. సన్నగా పొడవుగా ఉన్నాడు. అతడి తల్లోంచి చెమట కారిపోతోంది. ఎడమచేతికి వున్న వాచీకేసి రోడ్డుకేసి మాటిమాటికి తలతిప్పి చూస్తున్నాడు. అతడి కళ్లు చురుగ్గా వున్నాయి. మొహం ప్రశాంతంగా వుంది. ఎంఆర్ఓ ఆఫీసు ముందు జనం గుంపు చేరిపోయారు. ఎండ చుర్రుమంటోంది. ఉదయం పదకొండు గంటలవుతున్నా ఎంఆర్ఒ జాడలేదు. ఆఫీసులో సిబ్బంది కూడా పలుచగా ఉన్నారు.కొన్ని సీట్లు ఖాలీగా కనపడుతున్నాయి.ఒక ఉద్యోగి దినపత్రికని తల పైకెత్తకుండా శ్రద్ధగా చదువుకుంటున్నాడు. అతడి ముందు బిక్క మొహంతో ఒకామె నిలబడి
ఎరుకల కథలు

దేనికీ భయపడొద్దు

“ దీన్ని టీ అంటారా ?  ” మొగిలప్ప గొంతు మెత్తగా వుంది. పైకి గట్టిగానే  అంటున్నట్లున్నా  ఆ గొంతులో ఏదో కోపం, ఉక్రోషం, నిరసన ఉన్నాయి,  కానీ అంతగా గట్టిగా మాట్లాడలేక పోతున్నాడు.ఆ  గొంతులో ఏదో మొహమాటం, బెరుకు. నాకు చప్పున అర్థం కాలేదు. కానీ నేను ఆలోచించే లోపే మొగిలప్ప గొంతు సవరించుకుని  బెరుగ్గా  “ స్టీల్ గ్లాస్ లోనే టీ  ఇవ్వు రెడ్డీ , వేడిగా  వుంటుందని ఎన్నోసార్లు చెప్పింటా.  అయినా నువ్వు ఆ ప్లాస్టిక్ కప్పులోనో , పేపర్ కప్పులోనో ఇస్తావు. టీ అస్సలు తాగినట్లే వుండదు రెడ్డీ ..  ” అంటున్నాడు
ఎరుకల కథలు

ప్రయత్నం

దుర్గమ్మ గుడి ముందు  -  ఇందిరమ్మ ఎస్.టి. కాలనీలో ఆరోజు గ్రామసభ జరుగుతోందని, ఒకరోజు ముందే దండోరా కొట్టడం వల్ల, జనం అక్కడ గుమిగూడి పోయారు.మధ్యాహ్నం మూడు దాటింది. ఎండ చుర్రుమంటోంది. ఆ పంచాయతీలో ఉపాధిహామీ పనుల్ని పర్యవేక్షించే ఫీల్డ్ అసిస్టెంట్ రమణ వేపచెట్టు నీడలో చాపపరిచి కూర్చుని ఉన్నాడు. రెండు పాతచాపలు  ఒకదాని పక్కన ఒకటి పరచబడి ఉన్నాయి. ఆ రెండు చాపల చుట్టూ నాలుగు ఇనుప కుర్చీలు, రెండు ప్లాస్టిక్ కుర్చీలు పహారా కాస్తున్నట్లు ఉన్నాయి. చాపపైన తెల్లకాగితాలు, గ్రామసభ రిజిష్టరు, హాజరు పట్టిక, ఇంక్ ప్యాడ్, ప్లాస్టిక్ సంచిలో కొన్ని అర్జీలు రమణ ముందుపేర్చబడ్డాయి.
ఎరుకల కథలు

అదే ప్రశ్న

ఆ ఇంటిముందు నిలబడి ఇల్లు అదేనా కాదా అన్నట్లు పరీక్షగా చూసింది కమలమ్మ. వేణుగోపాలస్వామి గుడివీధి, మల్లెపూల పందిరిల్లు, రెండంతస్థుల ఆకుపచ్చని  పాత బిల్డింగు. సుభద్రమ్మ చెప్పిన గుర్తులన్నీ సరిపోయాయి. అయినా లోపలికి వెళ్లాలంటే ఒక్కక్షణం భయమేసింది. కాళ్లకేదో అడ్డం పడుతున్నట్లు అనిపించింది. మొహమాటంగా బెరుగ్గా అనిపించింది.మళ్ళీ తనే  ధైర్యం తెచ్చుకుంది. కదలకపోతే ఆగిపోయేది తన జీవితమే అని గుర్తు తెచ్చుకుంది.ఇల్లు ఇంట్లో ఆకలితో సగం చనిపోయినట్లు, ఒంట్లో రక్తమే లేనట్లు నిస్తేజంగా కనిపించే పిల్లల మొహాలు గుర్తుకు వచ్చేసరికి ఒక్క ఉదుటున ముందుకే కదిలింది. మనుషులు ఎట్లున్నా ముందుకు వెళ్లాల్సిందే, వెళ్లకపోతే ఎట్లా కుదురుతుంది ? ముగ్గురు
ఎరుకల కథలు

అన్నం పెట్టినోల్లని ..

పలమనేరులో  ఆరేడు కళ్యాణమండపాలున్నాయి.అన్నీ కొత్త పేటలోనే వున్నాయి. పాతపేటలో ఒకప్పుడు ఒక చిన్న సత్రం వుండేది, కానీ ఏవో గొడవలు, కోర్టు కేసుల వల్ల అది మూతబడింది. ఇప్పుడిక ఎవరిదైనా పెండ్లి అంటే కొత్తపేటకు వెళ్లాల్సిందే. నాలుగో నెంబరు జాతీయ రహదారి  దాటాల్సిందే. వంటమాస్టర్ ఎరుకల కపాలిని కలవాలంటే మాత్రం ఎవరైనా  పాతపేటలోని ఎస్టీ కాలనీకి రావాల్సిందే.!  కపాలి వుండేది ఎస్టీ కాలనీలోనే. ఆ మనిషి కోసం పెద్ద పెద్దోళ్ళు రోడ్డు దాటి, వీధులు దాటి ఎస్టీ కాలనీలోకి వస్తారు. మేం ఒకప్పుడు వాళ్ళ ఇండ్లల్లోకి పోలేని వాళ్ళమే అయినా,  ఇప్పుడు మా జాతోడు చేసే వంటలు అందరూ
ఎరుకల కథలు

“మా తప్పు ఏంది సామీ ?”

“ అశోకు వచ్చిoడాడా ? వాడి  గురించి ఏమైనా తెలిసిందా అబ్బోడా? “  యస్టీ కాలనీ లోకి అడుగుపెట్టి  దుర్గమ్మ   గుడిపక్కలోకి తిరిగి నిలబడితే చాలు, బోరింగు పక్కలోo చి ఎప్పుడూ ఒక పలకరింపు మీకు వినపడుతుంది. ఆ గొంతులో వణుకు, భయం, ఆదుర్దా ప్రేమ , ఆశ అన్నీ కలగలసిపోయి మీకు వినిపిస్తాయి.గుడిలోంచి వచ్చే పిలుపు కాదు అది. గుడి పక్కనే ఒక మొండిగోడల  సగం ఇల్లు మీకు కనపడుతుంది. పైన రేకులతో కప్పబడిన పాత ఇల్లు. తలుపు సగం ఊడిపోయి ఎప్పుడూ మూయాల్సిన అవసరం లేనట్లు వుంటుంది.బయటే నులకమంచం పైన ఒక సగంమనిషి  కూర్చునో ,