“మెట్రో జైలు” కథలు: 1 “హజారీబాగ్ జైలు గాధలు” సంపుటి “ఏదినేరం”, విరసం ప్రచురణగా పాఠకుల్లోకి వెళ్ళాక రెండవ భాగం ఎప్పుడు వస్తుంది అని చాలా మంది అడిగారు. మళ్ళీ అరెస్ట్ అయితే వస్తుంది అని సరదాగా అన్నాను. ఫాసిస్టు రాజ్యం ఆ మాటలని నిజం చేసింది. నిజానికి అలా అన్నాను కానీ భారతదేశంలో జైళ్ళన్నీ ఒకే లాగా ఉంటాయి కాబట్టి మళ్ళీ అరెస్టయినా కొత్త కథలు ఏం ఉంటాయి అని కూడా అనిపించింది. కానీ నేను రెండో సారి 2019 నవంబర్ లో అరెస్టయ్యి హైదరాబాదులోని చంచల్ గూడా జైలులో 8 నెలలు గడిపాక ఒక మెట్రోపాలిటన్