ప్రసాద్, మన వీధంత పోలీసులంట. ఏమయ్యిందో ఏమిటో?’’ పొద్దున్నె నా భార్య అనే సరికి, నిద్రెగిరిపోయి లేచి కూర్చున్న ‘‘ఏంది?’’ తిరిగడిగిన అనుమానంతో ‘‘మన పక్క ప్లాట్ అంకుల్ పాల పాకెట్ కోసం పోతే వీధిల ఎవరిని లోపలికి, బయటకు కదలనీయటం లేదట, వందల మంది పోలీసులు...’’ మెదడు వేగంగ పనిచేయసాగింది. విషయం అర్థమైంది. కాని ఇంత త్వరగా వస్తారని ఊహించలేకపోయా! అయినా ఇంత మంది రావుడేమిటి ? అనుమానం తీరక విషయం తెలుసుకుందామని, లుంగిమీదనె బయలుదేరబోతుండగా, నాకు బయటకు పోయె శ్రమ తగ్గించారు! ముందు డోర్‌ను సుతారంగ పగులగొట్టి సాయుదులు లోపలికొచ్చారు. డోర్ దగ్గర మరికొంత మంది