కవిత్వం వడ్డెబోయిన శ్రీనివాస్ కవితలు మూడు February 15, 2023February 15, 2023 వడ్డెబోయిన శ్రీనివాస్0 1. మృతకాలం-అమృతకాలం అమృతకాలం వచ్చిందహో ఆవుకు ! ఆలోచించినా ఆశాభంగం కౌగిలించుకో కౌగిలించుకో ఆహా. మనిషికంటావా మృతకాలమే. ఆకలితో ఉపాధి లేమితో బాదలతో కన్నీళ్ళతో కరోనా కార్మికచావువో కారోనా ఆకలిచావువో పోపో చప్పట్లు కొట్టుకుంటో దీపాలు వెలిగించుకుంటో అమృతకాలం వచ్చింది ఆవును కొగిలించుకో పోసిటివ్ ఎనిర్జీ వస్తుంది ఆహా మనిషికంటావా మృతకాలమే. పరిశీలకునివో పరిశోధకునివో శాస్త్రీయ సామాజిక వ్యాఖ్యతవో డబోల్కరో గౌరీ లంకేశో చంపబడితేనేం కాల్చబడితేనేం పొండి పొండి సత్యం ఉచ్చరిస్తూనే అమృతకాలం వచ్చింది ఆవును కౌగిలించుకో పాజిటివ్ ఎనర్జి వస్తుంది. ఆహా మనిషి కంటావా మృతకాలమే అపవిత్రమనో దళితనో ఎదురొచ్చాడనో ఎదురునిల్చాడనో పండు కోశాడనో నీల్లుతాగాడనో మీసాలు Read More