“ఆయమ్మ అంతే! ఆమె ఒక మదర్ తెరీసా!”
మా నాయన చెమటలు కార్చుకుంటా గసపోసుకుంటా సాయంత్రమో రాత్రో ఇంటికి వస్తాడు. ఊసురోమని ఆయన ఇల్లు చేరే టయానికి సరిగ్గా మా అమ్మ ఎప్పుడూ ఇంట్లో ఉండదు. పగలని లేదు రాత్రని లేదు, ఎవరు ఎప్పుడొచ్చి “ జయమ్మక్కా... ఏo చేసేది ఇప్పుడిట్లా అయిపోయిందే ..ఇప్పుడింక నాకు నువ్వే దిక్కు. ఏం చేస్తావో, యెట్లా చేస్తావో నీ ఇష్టం అక్కా ..” అని ఏడిస్తే చాలు, ఆయమ్మ అంతగా కరిగి పోతుంది. మాయమ్మ ముక్కుపుల్ల, ఉంగరం, కమ్మలు ఎప్పుడూ ఎవరికోసమో కుదవలోనే(తాకట్టు) వుంటాయి. ఆ మూడూ కలిపి ఆయమ్మ వేసుకుంది మాత్రం మా కళ్ళతో మేం మా చిన్నప్పుడు