కవిత్వం

చావు ఇపుడు ఎవర్నీ ఎత్తుకుపోలేదు

వాళ్ళు చావును జయించిన వాళ్ళుజైలు గోడలకు పాటలు నేర్పిన వాళ్ళుఇనుప ఊచలకు జానపద సంగీతం నేర్పిన వాళ్ళుజైలుపై నక్షత్రల దుప్పటి కప్పిగోడల మధ్య రహస్య సంభాషణ చేసినవాళ్లువాళ్ళేక్కడ వున్నానీ నా విమిక్తినే కోరుకున్న వాళ్ళురెడ్ కారిడార్ ఇండియా అంతారూపొందించిన వాళ్ళువాళ్లకు చావేంటిప్రెమొక్కటే గానం చేసినమన కాలం కబీర్లు వాళ్ళుఎర్ర జెండా ఎత్తి ఉంచండిమలయ సమీరమ్లా వచ్చి తాకుతారుపిడికిలి ఎత్తి పట్టి ఉంచండినరనరానా ఉక్కు సంకల్పంతోఎత్తి పడతారుసాయి నిబ్బరంగానే వున్నాడుచావును నిరాకరించిన వాడు కదాచూడు చిరు నవ్వుతో తిరిగి వస్తాడు. 10.18పీఎం
నివాళి

ప్రొ. కందాళ శోభారాణికి విరసం నివాళి

కాకతీయ విశ్వవిద్యాలయం అధ్యాపకురాలు ప్రొ. కందాళ శోభారాణి ఫిబ్రవరి 12న మరణించారు. గత కొన్నేళ్లుగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలోనే చదివి,  తెలుగు సాహిత్యంలో పరిశోధన చేసి అక్కడే ప్రొఫెసర్‌గా  చేరారు. సుదీర్ఘ ప్రజా పోరాటాల చరిత్ర ఉన్న వరంగల్‌లో సామాజిక చైతన్యంతో మేధో రంగంలోకి వచ్చిన ఈ తరం అధ్యాపకురాలు శోభారాణి. విద్యార్థిగా, పరిశోధకురాలిగా ఉన్న రోజుల్లోనే ఆమె తన చుట్టూ జరుగుతున్న ప్రజా పోరాటాలను శ్రద్ధగా గమనించేవారు. వాటిని అభిమానిస్తూ చేయూత ఇచ్చేవారు. అనేక నిర్బంధాలు చుట్టుముట్టి ఉండే వరంగల్‌లో బుర్రా రాములు వంటి వారితో కలిసి హక్కుల ఉద్యమంలో భాగమయ్యారు.  మానవ