వ్యాసాలు

‘సమూహ’ సృజనపై ఉన్మాద రాముడి దాడి

సాహిత్య రాముడిని సనాతన రాముడిగానే కొలవాలి. ధర్మావతారుడిగానే భజించాలి. రాముడు రామాయణమనే సాహిత్యరూపం కూడా తీసుకున్నాడు కాబట్టి రచయితలు డీకోడ్‌ చేయబోతే ఉన్మాద రాముడిగా వీరంగం తొక్కుతాడు. ఆయన వారసులు మద్యం తాగి, రాముడిని వేదాంత స్వరూపుడిగానే చూడాలని బూతులు తిడతారు. రాముడి గురించి మేం తప్ప మరెవరూ మాట్లాడటానికి వీల్లేదని దాడి చేస్తారు. లౌకికవాదంపై చర్చకు వాళ్ల అనుమతి తీసుకోలేదని మీదపడి కొడతారు. వరంగల్‌ ‘సమూహ’ అనుభవం ఈ దేశం ఎక్కడున్నదో ఎత్తి చూపుతున్నది. లౌకికవాదాన్ని కాపాడుకోవాలంటే మాట్లాడుకోవాలి కదా. ఒకరి మాటలు ఒకరు వినాలి కదా. సభ పెట్టుకోవాలి కదా. లౌకికవాదాన్ని చర్చించబోతే రాజ్యాంగంలోని హక్కులన్నిటినీ