పత్రికా ప్రకటనలు

బైరి నరేష్‌ పై హిందుత్వ మూకల దాడి

నరేష్‌పై హిందుత్వ శక్తులు ఫిబ్రవరి 27న మరోసారి దాడికి పాల్పడ్డాయి. ఈసారి పోలీసుల సమక్షంలోనే  దాడి జరిగింది.   మనోభావాలు దెబ్బతిన్న భక్తుల మూక ఈ పని చేసిందా? లేక కేసీఆర్‌ ప్రభుత్వ అండతో చెలరేగిపోయి దాడికి దిగిందా? అనే ప్రశ్నలు చాల మామూలు వాళ్లకు కలిగేలా ఈ ఘటన జరిగింది. నరేష్‌ అభిప్రాయాలేవైనా సరే... అవి ఆయన భావ ప్రకటనా స్వేచ్ఛలో భాగం. హేతుబద్ధ చర్చకు ఆస్కారం ఇవ్వదల్చుకోని వాళ్లే తరచూ మనోభావాల పేరుతో ఉన్మాద చర్యలకు పాల్పడుతుంటారు. ఇది ఫాసిస్టు లక్షణం. నరేష్‌పై దాడి వల్ల నాస్తిక, హేతువాడ, ప్రగతిశీల, విప్లవ శక్తులకు ఫాసిస్టు శక్తులు ఒక