నెత్తుటితో తడుస్తున్న నేల గురించి
‘మనిషే మనిషిని చంపుకు తినే ఈ లోకం ఎంతకాలం మనగలదు’ ‘మూర్ఖుడా యుద్దాతో దేశాల్ని కొల్లగొట్టగలవేమో సరిహద్దుల్ని జరపగలవేమో మహా అయితే ఇంకో విస్తీర్ణాన్ని నీ కాలి కింద తొక్కి పట్టగలవ్ జనం హృదయాలనైతే గెలవలేవు’ ‘ప్రేమను పంచడం కంటే మరో మతం లేదు’ ‘చివరగా యుద్దం సమస్త జీవరాశిని చంపుతుంది’ ...ఇటువంటి కవితావాక్యాలతో పాలస్తీనా`ఇజ్రాయిల్ యుద్దానికి వ్యతిరేకంగా..సామ్రాజ్యవాదాన్ని నిరసిస్తూ వచ్చిన కవిత్వమే ఈ గాజాలేని జాగా..ఇప్పుడు దేశాలకు దేశాలు శ్మశానాలౌతున్నాయి. నిత్యం నెత్తుటితో తడుస్తున్నాయి. గాయపడ్డ నేల కాదది..చంపబడ్డ నేల..చెరచబడ్డ నేల..పసికందులని కనికరం లేకుండా బుల్లెట్ల వర్షం కురుస్తున్న నేల..ఇప్పటికీ ఎటుచూసినా దేహాన్ని తెంచుకుని విసిరేయబడ్డ అవయవాలు,