రెప్పవాల్చని చూపు
'అట్టడుగున అందరమూ మానవులమే' అన్న కవి మాటల్లో జీవశాస్త్రపరమైన అర్ధానికి మించిన సామాజిక మానవసారం ఇమిడి ఉంది. అటువంటి ప్రాకృతిక మానవసారంతో తొణికి సలాడే మనిషి కేంద్రంగా రాసిన కవిత్వమే మిత్రుడు ఎన్. వేణుగోపాల్ 'రెప్పవాల్చని కాపలా'. మరి కవి వేణుగోపాల్ పావురపడే మనిషి ఎవరు? ఆ మనిషి అతడు కావచ్చు. ఆమె కావచ్చు. మరి అతడు/ ఆమె కేవలం ఒక్క వ్యక్తేనా? కానే కాదు. మనిషి అస్తిత్వానికి ఏకరూపం లేదు. బహు రూపాలు ఉన్నాయి. అనంతమైన భిన్నత్వం ఉంది. కనుక సహజంగానే మనిషి ఆలోచనలోను, ఆచరణలోనూ అటువంటి విభిన్నత్వమే ఉంటుందని ఈ కవి భావిస్తాడు. అయితే ఆయనకు