ఆదాన ప్రదానాల్లో భారత్
అయినా మన పిచ్చిగానీ , ఎంత అమెరికన్ సెoట్లతో ముంచినా, ఎంత దేశభక్తి, జాతీయతా వాదంతో ముంచెత్తినా, కుళ్ళిన శవం కంపుగొట్టకుండా ఉంటుందా? ఐదేండ్లకొకసారి, శవపేటిక నుండి బయటకు లాగి, ఎన్నికల ప్రజాస్వామ్య శవాన్ని జీవమున్న దానిగా ప్రదర్శిస్తే మాత్రం, ప్రతి ఏడాది, అత్తరుతో స్నానం చేయించి గులాబీ, మల్లెలతో అలంకరించి వీధుల వెంట “భారత్ మాతాకు” జై, “జై శ్రీరాం ” నినాదాలతో హోరెత్తిస్తూ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసినంత మాత్రాన లేని జీవం ఎక్కడ నుండి వస్తుంది. ఈ కుళ్ళు వ్యవస్థను సమూలంగా ధ్వంసం చేయకుండా, అది హర్షద్ మెహతా కావొచ్చు, లేక కేతన్ పరిక్ కావొచ్చు..