సెబీలో ‘హిండెన్ బర్గ్’ తుఫాన్
18 నెలల క్రితం అదానీ గ్రూప్ ఏకపక్ష సామ్రాజ్యాన్ని పునాదులతో కుదిపేసిన అమెరికాకు చెందిన ఫోరెన్సిక్ పరిశోధన సంస్థ హిండెన్ బర్గ్ మరోసారి 'సమ్ థింగ్ బిగ్ న్యూస్ ఇండియా' అంటూ 'ఎక్స్'లో ఆగష్టు 10న పేర్కొన్న గంటల వ్యవధిలోనే బాంబు పేల్చింది. అదానీ గ్రూప్ అక్రమంగా నిధులు మళ్లింపునకు ఉపయోగించిన విదేశీ ఫండ్స్, షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్స్ లో, బెర్ముడా (బ్రిటిష్), సింగపూర్లో లో గౌతమి ఆదానీ అన్న వినోద్ అదానీ నెలకొల్పిన కంపెనీలో 'సెబి చైర్ పర్సన్' మాధవి పూరి బుచ్' తో పాటు ఆమె భర్త 'ధవళ్ బుచ్'