ఆర్ధికం

ప్రజా వ్యతిరేక బడ్జెట్

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి ఒకటిన పార్లమెంటులో 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌  దేశం ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అధిక ధరలు, పేదరికం వంటి పేద ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ కార్పొరేట్‌ శక్తులను ఊతమిచ్చే విధంగా ఉంది. బడ్జెట్‌ అంటే ప్రభుత్వ ఆదాయ-వ్యయాల చిట్టా మాత్రమే కాదు. దానికి ఒక తాత్విక చింతన ఉండాలి. ఆదాయం ఎవరి నుంచి వస్తుంది, వ్యయం ఎవరి కోసం చేస్తున్నారనేది బడ్జెట్‌లో కీలకాంశం. ప్రధానంగా దేశ ప్రజల ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలు ఏలా అభివృద్ధి చేయాలనే కనీస ఆలోచన ఉండాలి. కాని మన పాలకులకు ప్రజలు కనిపించడం