నివేదిక

చిడియాబేడా ఆదివాసీలపై
పోలీసుల క్రౌర్యం

రూర్ఖండ్‌లోని సరండా అడవుల గురించి మీరు వినే ఉంటారు. భారతదేశంలోనే అనేక పోరాటాలతో ప్రజ్వరిల్లుతున్న నేల అది. ఆ ఉద్యమాలను అణచివేయడానికి చాలా ఏళ్లుగా అక్కడ దారుణ నిర్బంధం కొనసాగుతోంది. అయినా ఆదివాసులు వెనక్కి తగ్గలేదు. చిడియాబేడా, లోవాబేడా, హాథిబురు అడవులలో కోబ్రా బటాలియన్‌ 209, 205, రూర్జండ్‌ జాగ్వార్‌, సీఆర్‌పీఎఫ్‌కు చెందిన పోలీసు బలగాలు గాలింపులు జరుపగా కొన్ని పోస్టర్లు, బ్యానర్లు సహ రోజువారిగా వాడుకునే దినుసులు దొరికినట్టు, సీరిస్‌ కనెక్షన్‌లో వుంచిన మందుపాతరలను కనుగొని వాటిని డిఫ్యూజ్‌ చేసినట్టు 12 నవంబర్‌ 2022 (ప్రభాత్‌ ఖబర్‌, దైనిక్‌ భాస్కర్‌ తదితర హింది పత్రికలలో) వార్త ప్రచురితమైంది.