ఫాసిస్టు వ్యతిరేక ప్రజాయుద్ధ సేనాని
స్టాలిన్ వ్యతిరేకతతో మొదలై కమ్యూనిస్టు వ్యతిరేకులుగా మారిపోయిన వాళ్లు చరిత్రలో కోకొల్లలు..’ అని చలసాని ప్రసాద్ డజన్ల పేర్లు ఉదహరించేవారు. ఇరవయ్యో శతాబ్దపు విప్లవాల్లో, సోషలిస్టు నిర్మాణ ప్రయత్నాల్లో స్టాలిన్ అంత జనామోద నాయకుడు లేరు. ఆయనలాగా విమర్శలు మోసినవాళ్లూ లేరు. బహుశా ఒక వెనుకబడిన పెట్టుబడిదారీ దేశంలో విప్లవోద్యమానికేగాక సోషలిస్టు నిర్మాణానికి కూడా నాయకత్వం వహించడం ఆయన ప్రత్యేకత. ఆ శతాబ్ది విప్లవాల ప్రత్యేకతల్లాగే ఆ కాలపు సోషలిస్టు నిర్మాణ ప్రత్యేకతలను కూడా పరిగణలోకి తీసుకొని చూడ్డానికి ఇప్పుడు చరిత్ర మనకు అవకాశం ఇచ్చింది. అందుకే ఇప్పటికీ విప్లవమన్నా, సోషలిజమన్నా స్టాలిన్ అజరామర పాత్ర మీద అంతులేని