కథలు

ప్రజలదే విజయం

వేసవికాలం సెలవుదీసుకుంటూ వర్షాకాలం ప్రారంభమవుతున్న సమయం. అది జూన్‌ చివరి వారం. వేసవి ఎండలతో మోడుబారిపోయి ముఖం మాడ్చుకున్న ఆ అడవితల్లి అప్పుడప్పుడే కురుస్తున్న వర్షాలకు చిగురిస్తూ అడివంతా తన అందాన్ని సంతరించుకుంటున్నవేళ. ఆ చుట్టుపక్కల ఆదివాసీ పల్లెలన్నింటిని గలగలమనే శబ్దాలతో పలకరిస్తూ పారుతున్న బలిమెల నది. ఈ సహజసిద్ధమైన ప్రకృతి అందాల మధ్య ఆ ఊరి ప్రజలందరూ దుక్కులు దున్నుతూ విత్తనాలు వేస్తున్నారు. వర్షానికి తడిసి బురదగా మారిన మట్టిలో స్వేచ్ఛగా ఆడుకుంటున్నారు చిన్నపిల్లలు. ప్రకృతి ఇచ్చే ఊట నీటితో బిందెలు నింపుకొని నాలుగైదు వరసలు తలపై పెట్టుకొని కూనిరాగాలు తీస్తూ పొలం గట్లపై నడుస్తూ ఇళ్లకు