విప్లవ చారిత్రక నవల
‘‘తమ తిరుగుబాటు ఒక జార్‌ని దించేసి మరో జార్‌ని, లేదా మరో పాలకుడ్ని సింహాసనం మీద కూర్చోబెట్టడం కాదు. ఒక మహాలక్ష్యం కోసం ఉద్దేశించినది’’సెర్గీమాట The secret of beauty is the secret of life. The beauty of life is the beauty of struggle. (Y. Borev : Aesthetics, p.44& 46)(జీవిత రహస్యమే సౌందర్య రహస్యం. సంఘర్షణ సౌందర్యమే జీవిత సౌందర్యం) జీవితం, సంఘర్షణ, సౌందర్యం - ఇవి ఒక విడదీయరాని త్రయం. రచయిత నాగభూషణ్ రచించిన బృహన్నవల ‘‘డిసెంబరిస్టు ఖైదీ’’ ఒక చారిత్రక నవల. ఒక ఉద్యమ చరిత్రను ప్రతిబింబించిన