ఫాసిజానికి వ్యతిరేకంగా స్టాలిన్
ఫాసిజం పుట్టుకను అర్థం చేసుకోవాలంటే ముందు పెట్టుబడిదారీ విధానం ఏ దశల గుండా ప్రయాణించినదీ తెలుసుకోవాలి. పెట్టుబడిదారీ విధానానికి రెండు దశలున్నాయి: స్వేచ్ఛా పోటీ ఉన్న పెట్టుబడిదారీ విధానం పెట్టుబడిదారీ విధానం యొక్క అత్యున్నత దశ అయిన గుత్త పెట్టుబడిదారీ విధానం. స్వేచ్ఛా పోటీ ఉన్న పెట్టుబడిదారీ విధానంలో పెట్టుబడిదారులు ఒకరితో ఒకరు స్వేచ్ఛగా పోటీ పడుతూ ఉత్పత్తి చేస్తుంటారు. ఈ పోటీలో కొంతమంది వెనుకబడిపోతారు, కొంతమంది నాశనమైపోతారు. మరికొంతమంది క్రమంగా సంపదలను కూడబెట్టి గుత్త పెట్టుబడిదారులుగా ఎదుగుతారు. ఈ విధంగా పెట్టుబడిదారీ విధానం క్రమంగా అభివృద్ధి చెందుతూ తన అత్యున్నత దశ అయిన సామ్రాజ్యవాద దశను చేరుకుంటుంది.20వ