ఆరు రోజుల్లో తొమ్మిది మంది మహిళలు
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను వరదలు ముంచెత్తుతున్న ఈ వారంలో పొరుగునే ఉన్న చత్తీస్‌ఘడ్‌లో పాలకులు పధ్నాలుగు మందిని చంపి నెత్తుటి వరదలు పారించారు. వీళ్లలో ఆదివాసులు ఎందరు? అచ్చమైన మావోయిస్టులు ఎందరు? అనే చర్చ ఆసక్తి ఉన్న వాళ్లు తేల్చుకోవచ్చు. ఈ హింసను ఖండిరచడానికి, లేదా మన రాజకీయ వ్యతిరేకతల వల్ల ఉదాసీనంగా ఉండటానికి మృతులను ఎలాగైనా గుర్తించవచ్చు. కానీ వాళ్లు మనుషులు. స్త్రీలూ పురుషులుగా చూడదల్చుకుంటే ఇప్పటికి తెలుస్తున్న వివరాల ప్రకారం తొమ్మిది మంది మహిళలు. మొదట ఘటనా వివరాలు చూద్దాం. ఆగస్టు 29వ తేదీ చత్తీస్‌ఘడ్‌లోని నారాయణపూర్ జిల్లాలో ముగ్గురు మహిళా మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో