నమ్మకం చిట్లిన చోట
కన్నీటి బోట్లను కుట్టుకుంటూ
ఆశల పడవను నడుపుతున్నాను

గాయపడిన అనుభవాలలోంచి
కొత్త పాఠాలు నేర్చుకుంటున్నాను

కొంత ప్రయాణంలో
నిజాలు తేలియాడినపుడు
వ్యూహాలు పదును తేరాలి

కాలాన్ని ఎదురీదడమంటే
మార్పులను అవగతం చేసుకోవటమే

దారులు ఇరుకవుతున్నప్పుడు
ఆలోచనలు పదునెక్కాలి

ఒక్కోదానికి ఒక్కో హద్దు గీసి
అనంత విశ్వాన్ని గుండెల్లోంచి తీసి
అనేకానేకాలుగా దర్శించాలి

చీమ బలం చూసి
కన్నులెగరేసి
ఆకాశాన్ని ఎత్తగలం
ఆకాశం పైకి ఎక్కగలం

లక్ష్యం కుదుపుతున్నపుడు
రహ దారులు ఇట్టే చిగురిస్తాయి

ఊహకు రూపం ఇవ్వడమంటే
కొన్ని కన్నీటి మెట్లు ఎక్కటమే .

ఇప్పుడు అంతే బాధలోంచి లేచి
తీరాలకి చేరి
ఇక సమీరాలు అందివ్వాల్సిన సందర్భంలోంచి
చినుకుల్లా కురిసిన ఒక నేను .

Leave a Reply