ఆకలి ఆక్రందనలు
అత్యాచారలు  అన్యాయపు
కారు చీకట్లను చీల్చె 
అక్షరాలపై నిషేధమా..?

అంటరాని పూరి గూడిసేల
నెగడయి నిటారుగ నిలబడి
కందిలయి దీపమయినందు
అక్షరాలపై నిషేధమా..?

నొసటి మీద చమట 
నేల చిందనిదే
చదును కాని హలం
సేద్యపు గింజల రాశులు పోసిన చొట
కర్షకులు కాయకష్టంబయిన 
అక్షరాలపై నిషేధమా..?

అణిచివేతలపై తిరుగుబావుట జెండాయై
ప్రజల గొంతుకల పోరు పాటలయి
ప్రతిధ్వనించిన నేలలో
అక్షరాలపై నిషేధమా..?

అసమానతల కంఠాన్ని తెగనరికి
తెలంగాణ ఉద్యమ రాగాన్ని పల్లవించి
యెల్లలు లేని ప్రపంచానికి చాటిన
అక్షరాల మీద నిషేధమా..?

ఆర్థిక రాజకీయ కోణాన్ని విడమర్చి చాటి
హక్కులకై సల్పిన పోరులో
నెగడయి మండుతున్న
అక్షరాలపై నిషేధమా..?

అవును

అక్షరాలు ఇప్పుడు నిషేధమె
అప్పుడు నిషేధమె
రాజ్యాన్ని ప్రశించినందుకు
రాజ్యపు  నిషేధాలా కొలిమిలొంచి
కాగడాలయి అక్షరాల మంటలను
దావనంలా వ్యాపిస్తాయి…

(విరసం పై నిషేధాన్ని ఖండిస్తూ….)

Leave a Reply