మరణం మౌనం కాదు
నిశ్శబ్దన్ని బద్ధలుకొట్టడమే.
ఆశయం కోసం నడిచి అలసిపోలేదు,ఆరిపోలేదు.
అడుగుల చప్పుడు ఆశయం కోసం వినబడుతూ వున్నాయి.
చెదలు పట్టిన సమాజం ను
చర్చలతో ఛేదించలేమన్నారు
విఫలం అయితేవిప్లవమే అన్నాడు.
యుద్ధంకోసంమాటీచ్చి మరిచిపోలేదు.
వాగ్దానంగనిలబడ్డాడు.
మృత్యువు ముచ్చట పెట్టిన
చివరిరక్తం బొట్టుచిందించిండు.
మాయదారి రోగంమందలించిన
పోరుదారికి మరణంలేదన్నడు.
చిగురించిన వసంతములో
మేఘమై కురుస్తానని.
రేపటి పొద్దుకు
మాటిచ్చిన వీరుడతడు.
15-10-2021