పలకమీద
అక్షరాలను
తుడిపేసినట్టు
హృదయంలో
బంధాల జ్ఞాపకాలను
చెరిపేయగలమా..!

అంతరంగం
అర్ధమైనప్పుడు
ఆశ శ్వాస
అందనంత దూరమైపోతుంది..!

అబద్దాన్ని
నిజంగా నమ్మించొచ్చు
నిజాన్ని
అందరికి
తెలియనీయకపోవచ్చు
ఎల్లప్పుడు
చికటేవుండదుగా..!

తనడప్పుదరువు
నీ గుండెను తాకలేదా..?
తనగొంతులో గానం
నీ చూపు దిశను మార్చలేకపోయిందా..?

తను నీవొడిలో తలవాల్చి
బిడ్డలా వొదిగిపోయినప్పుడు
నువు తలనిమిరింది నాటకమేనా..?

మానవ సంబంధాల్లో
అత్యంత సున్నితమైనది
సహచరి సహచరుడు బంధమే..!

దానిని గండ్రగొడ్డలితో నరికి
అందరిని ఆశ్చర్యంలో
ముంచేసిన అమావాశవి..!

ప్రజలదారిలో నీ నడకలేదని
కాలక్రమంలో బహిర్గతమయ్యింది..!

ఏబంధం లేని కరచాలానికే
కలచివేస్తున్నప్పుడు
కనుపాపలా చూసిన చూపుకి
కన్నీరే మిగిల్చావు..!

Leave a Reply