అనంత విశ్వాన్ని నిబ్బరంగా చూస్తాను
అంతా అర్థం అయినట్టే కట్టిపడేస్తుంది
జీవితం కూడా.

ఆకర్షణ తో కట్టుబడ్డట్టు
ముడిపడటాలు చెదిరిపోవటాలు చూస్తాం.

కాలం పైన చిరు నవ్వు తాకి
కాసేపు చేసే కాలక్షేపం చూస్తాం.

మరుక్షణం
గాలికి కాలం ఊగి
పెట్టే కన్నీటిని చూస్తాం.

మురిసిపోయే లోపే
తుపాను ముసిరినట్లు
అంతలోనే
స్వచ్ఛం గా దృశ్యాలుగా చెక్కబడుతున్నట్లు
అనుభవాలు కుదుపుతుంటాయి .

తీరం వైపు కళ్ళను పరచి
అలల కెరటాలను చూస్తాను.
సంతోషాలు దుఃఖాలు పోటీపడి
ఊగిపోతుంటాయి.

అయినా
నిశ్చలంగా సముద్రం వైపు చూస్తూ
ప్రశాంతతను పల్లవిస్తాను.

One thought on “అలల కెరటాలు

Leave a Reply