సుఖమయ జీవితాల్లోని 
సంతోషాల్ని నిషేదించుకున్నోళ్లం 

గాఢాంధకారంలో చిక్కిన 
మట్టి బిడ్డలకోసం 
చిమ్మ చీకట్లను 
ఆలింగనం చేసుకున్నోళ్లం 

నెర్రెలిచ్చి 
డొక్కలెండిన 
దుఃఖ్ఖ సాగరాల 
కనుకొలుకుల్లో 
కాంతి రేఖలమై 
పునర్జీవించినోళ్ళం

శతాబ్దాల 
శుష్కవాగ్దానాల
నీ పురోభివృద్ధి 
పాదాలకింద చితికిన
ఆకలి పేగులమన్యానికి 
సైనిక కవాతునేర్పినోళ్ళం 

అడవిని అన్యాక్రాంతం 
అవనివ్వని శపథాన్ని 
ఎరుపెక్కిన 
పతాక రెపరెపల్లో                                                         
నిత్యం నిగనిగలాడే                                             
నిఘా జేసినోళ్ళం 

నిషేధిస్తావా.. 
మము నిరోధిస్తావా..

పోటెత్తే సముద్రాన్ని 
అన్లాఫుల్ యాక్టివిటీ కింద
అదుపుకు చట్టం చేస్తావా..

ఆ అలల హోరుకు 
సంకెళ్ళేస్తావా..

వెయ్ సూద్దాం..!?

Leave a Reply