ఏ బాటసారికి తెలుసు, తను నడిచే దారుల్లో అణచబడ్డ రాళ్లకథ!! ఏ పువ్వులు తీర్చేను, తను వికసించే సాయంలో దాయబడిన వేర్ల కల!! నేలైనా అడిగిందా, తనకు రంగులద్దే రైతు వ్యధని!! పంటకు తెలుసో లేదో, చినుకు రుణం తీర్చలేనిదని!! దీపాలు ఒప్పుకోగలవా, చమురు మింగి బ్రతికామని.. కన్నీరు చెప్పగలదా, తన పుట్టుక కారణాన్ని.. అక్షరాలు రాయగలవా, యదనలుముకున్న మౌనాన్ని.. మనిషి నగ్నంగా తిరగగలడా తన ముసుగులన్ని వదిలేసి!!
మనిషి నగ్నంగా తిరగ గలడా!
ముసుగులన్నీ వదిలేసి