ఫిబ్రవరి 24వ తేదీ న్యూఢిల్లీలో జరిగిన జి-20 దేశాల ఆర్థిక మంత్రుల, సెంట్రల్‍ బ్యాకుంకు గవర్నర్ల సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన సందేశం ఇది! ‘‘భారత ఆర్థిక వ్యవస్థ అద్బుతంగా పురోగమిస్తోంది.భారతీయ వినియోగదారులు, ఉత్పత్తిదారులు భవిష్యత్తు పట్ల ఆశాజనకంగానూ, విశ్వాసంగానూ ఉన్నారు. దీని నుండి ప్రపంచ దేశాలు స్ఫూర్తిని పొందాలి. ఈ సమావేశంలో పాల్గొంటున్న వారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అదే సానుకూల దృక్పథాన్ని అందించగలరని మేం ఆశిస్తున్నాం. ప్రపంచ వృద్ధిలో స్థిరత్వాన్ని, నమ్మకాన్ని సాధించాలంటే అదొక్కటే మార్గం’’.


ప్రధాని ఆ మాటలు చెప్పి పది రోజులు గడవకవ•ందే వాల్‍స్ట్రీట్‍ జర్నల్‍ తాజాగా దానికి పూర్తి భిన్నమైన కథనాన్ని ప్రచురించింది. భారత ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా తగిందని, దీని ప్రభావం ఉత్పత్తులపై పడుతోందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారమే ఈ నిర్థారణలు చేయడం గమనార్హం. వాల్‍స్ట్రీట్‍ జర్నల్‍ ప్రచురించిన కథనం ప్రకారం… సెప్టెంబర్‍ నెలతో వ•గిసిన త్రైమాసికంలో దేశ వార్షిక ఆర్థిక (ఇయర్‍ ఓవర్‍ ఇయర్‍) వృద్ధి 6.3 శాతం కాగా, తాజాగా విడుదల చేసిన డిసెంబర్‍ గణాంకాల ప్రకారం 4.4 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది. తయారీ రంగంలో క్షీణత కొనసాగుతున్న ఫలితంగానే వృద్ధిరేటు గణనీయంగా తగ్గింది. ప్రజల కొనుగోలు రేటు గణనీయంగా తగ్గడం కూడా వృద్ధి గణాంకాలపై తీవ్ర ప్రభావం చూపింది.


గత సెప్టెంబర్‍ నెలలో 8.8 శాతం ఎక్కువగా ప్రజలు దేశవ్యాప్తంగా ఖర్చు చేశారు. అ••తే, తాజాగా విడుదలైన డిసెంబర్‍ గణాంకాలను పరిగణలోకి తీసుకుంటే ఈ పెరుగుదల కేవలం 2.1 శాతమే! అంటే, సెప్టెంబర్‍తో పోలిస్తే ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది. గత ఏడాది (2021) డిసెంబర్‍లో 10.8 శాతంగా ప్రైవేటు వినియోగం నమోదు కాగా, 2022 డిసెంబర్‍ మాసాంతానికి 2.1 శాతం మాత్రమే నమోదైంది. జిడిపిలో 60 శాతం దాకా తయారీ రంగం నుండే రావాల్సి ఉందని, అది పుంజుకోకపోగా తగ్గుతుండడం ఆందోళనకరమని పేర్కొంది. కొనుగోళ్లు లేకపోవడం ఉత్పత్తి కార్యక్రమాలపై ప్రభావం చూపుతోందని, నిరుద్యోగానికి, ఉపాధి రహితస్థితికి కారణమవుతోందని వాల్‍స్ట్రీట్‍ జర్నల్‍ విశ్లేషించింది.

ఎందుకీ స్థితి?:


‘అధిక ధరలతో పాటు వడ్డీ రేట్లు భారీగా పెరుగుతున్నా••. కరోనా సంక్షోభం తరువాత గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి ఆశించినంతగా మెరుగుపడలేదు. పట్టణాలు, నగరాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. దీనికి తోడు కరోనా కాలంలో ఇచ్చిన అనేక సబ్సిడీలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇది ప్రజలకు భారంగా మారింది’ అని ‘వాల్‍స్ట్రీట్‍’ విశ్లేషించింది. 2021 మే నెల నుండి ఇప్పటివరకు రిజర్వు బ్యాంకు పలు దఫాలు వడ్డీ రేటు పెంచిన విషయం తెలిసిందే. ఏప్రిల్‍ నెలలో మరో 0.25 పా••ంట్లను పెంచే అవకాశం ఉందని, ఈ మేరకు ఇప్పటికే కసరత్తు జరుగుతోందని పేర్కొంది. దీనితో కలుపుకుంటే వడ్డీ రేట్లు 6.75 శాతానికి చేరుకుంటాయని, ఇది పేద, మధ్య తరగతి ప్రజలకు పెనుభారంగా మారుతోందని తెలిపింది. ఎగుమతులు తగ్గడం కూడా ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతోందనడానికి నిదర్శనమని వివరించింది.
మరింత క్లిష్టం :
ప్రభుత్వం చెబుతున్న మాటలు ఎలా ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో ఆర్థిక వ్యవస్థ మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని వాల్‍స్ట్రీట్‍ జర్నల్‍ హెచ్చరించింది. వాతావరణ మార్పుల కారణంగా వేసవి కాలం తీవ్రంగా ఉండనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో పాటు ఎల్‍నినో పరిస్థితుల ప్రభావాన్ని ప్రస్తావించింది. వడగాల్పులు ఉధృతంగా ఉండడంతో ఆర్థిక కార్యకలాపాలు మరింతగా క్షీణించనున్నాయని అంచనా వేసింది.


హెచ్చరించిన ప్రతిపక్షాలు :


దేశ వ్యాప్తంగా ప్రజల కొనుగోలుశక్తి పడిపోతుండడం, నిరుద్యోగం పెరుగుతుండడంపై ప్రతిపక్షాలతో పాటు, పలువురు ఆర్థిక నిపుణులు కేంద్ర ప్రభుత్వాన్ని కొంతకాలంగా హెచ్చరిస్తూనే ఉన్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెంచడానికి చర్యలు తీసుకోవాలని వారు చేసిన సూచనలను కేంద్రం ఏ దశలోనూ పట్టించుకోలేదు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి వడ్డీ రేట్లు పెంచడమే మార్గం కాదని, ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టాలని చేసిన సూచనలను కూడా కేంద్రం పెడచెవిన పెట్టింది.
మరీ బలహీనంగా భారత ఆర్థికం :
దేశ ఆర్థిక వ్యవస్థపై ఆర్‍బిఐ ద్రవ్య విధాన కమిటీ(ఎంపిసి) సభ్యులు, అహ్మదాబాద్‍లోని ఇండియన్‍ ఇన్‍స్టిట్యూట్‍ ఆఫ్‍ మేనేజ్‍మెంట్‍ ప్రొఫెసర్‍ జయంత్‍ వర్మ ఆందోళన వ్యక్తం చేశారు. భారత ఆర్థిక వృద్ధి ‘చాలా బలహీనంగా’ ఉన్నట్టు కనిపిస్తున్నదని చెప్పారు. పెరుగుతున్న శ్రామిక శక్తి ఆకాంక్షలను తీర్చడానికి దేశానికి అవసరమైనదాని కంటే ఆర్థిక వృద్ధి తక్కువగా ఉండొచ్చని అన్నారు. పెరుగుతున్న ఇఎంఐ చెల్లింపులు గృహ బడ్జెట్‍లపై ఒత్తిడిని పెంచుతాయని తెలిపారు. ఎగుమతులు ప్రపంచంలో పలు అంశాల కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు. అధిక వడ్డీ రేట్లు ప్రైవేటు వ•లధన పెట్టుబడిని మరింత కష్టతరం చేస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఆర్థిక ఏకీకరణలో ఉన్నదనీ, దీంతో ఇటువైపు నుంచి ఆర్థిక వ్యవస్థకు మద్దతు తగ్గుతుందని వర్మ అన్నారు. ఈ అంశాల కారణంగా మన జనాభా సందర్భం, ఆదాయ స్థా••ని బట్టి పెరుగుతున్న మన శ్రామికశక్తి ఆకాంక్షలకు అనుగుణంగా దేశ ఆర్థిక వృద్ధి తక్కువగా ఉండవచ్చని తాను ఆందోళన చెందుతున్నానని ఆయన తెలిపారు.
కరోనా మహమ్మారి, •••క్రెన్‍ •••ద్ధం నుంచి సరఫరా షాక్‍లు క్రమంగా ప్రపంచ ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు రాబోయే నెలల్లో ప్రభావాన్ని చూపుతాయని అన్నారు. ప్రపంచం •••ద్ధంతో జీవించడం నేర్చుకుంటున్నదనీ, అదే సమయంలో ద్రవ్య పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా వృద్ధిని ప్రమాదంలో పడేస్తున్నాయని ఆయన చెప్పారు. 2022-23 ద్వితీయార్థం అధిక ద్రవ్యోల్బణ సంవత్సరం అని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం(సిపిఐ) అంచనాను ఆర్‍బిఐ 6.7 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. జనవరిలో భారత రిటైల్‍ ద్రవ్యోల్బణం 6.52 శాతంగా ఉన్నది.
రిజర్వ్ బ్యాంక్‍ స్వల్పకాలిక రుణ రేటును పెంచడంపై స్పందిస్తూ ఈ నేపథ్యంలో విరామం సరైనదని వర్మ్ అన్నారు. గతేడాది మే నుంచి స్వల్పకాలిక రుణ రేటును పెంచుతున్న రిజర్వ్ బ్యాంకు.. రెపో రేటును 250 బేసిస్‍ పా••ంట్లు పెంచింది. రెపో రేటు ఇప్పుడు 6.5 శాతంగా ఉన్నది. దేశ ఆర్థిక వ్యవస్థపై ఒకపక్క మోడీ సర్కారు గొప్పలు చెప్పుకుంటున్నది. 5 లక్షల డాలర్ల ఆర్థిక వ్యవస్థను తయారు చేస్తామని, ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో టాప్‍ 10లో ఉన్నామని ప్రచారాలు చేసుకుంటున్నది. అ••తే, అదానీ వంటి బడా స్నేహితుల ప్రయోజనాలకు మోడీ సర్కారు ప్రాధాన్యతనిస్తున్నదని ఇప్పటికే పలువురు ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆర్‍బిఐ ఎంపిసి సభ్యులు కూడా దేశ ఆర్థిక వృద్ధిపై ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.


తిరోగమనంలో ఆర్థిక వ్యవస్థ :


ఆత్మ నిర్భర్‍ భారత్‍ అంటూ కేంద్రంలోని బిజెపి సర్కార్‍ చెప్పిన మాటలన్నీ ‘కేవలం మాటలేనని’ తేలిపో••ంది. దేశం అభివృద్ధిలో దూసుకుపోతోందంటూ ప్రధాని మోడీ పదే పదే చేసిన ప్రకటనలన్నీ కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలు ఊదరగొటుడేనని స్పష్టమైంది. గత వ•డేండ్ల లెక్కలు, గణాంకాల ప్రకారం… దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో కాదు.. తిరోగమనంలో కొనసాగుతోందని స్పష్టమైంది. ఇది ప్రతిపక్షాలో, ఆర్థిక నిపుణులో చెబుతున్న విషయం కాదు. సాక్షాత్తూ కేంద్ర ఆర్థిక సర్వే (2022-23) నిగ్గు తేల్చిన నిజాలు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం వల్ల మన దేశ ఎగుమతులపై ప్రభావం పడే అవకాశవ•ందని ఆ సర్వే వెల్లడించింది. ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపనుందని ఆందోళన వ్యక్తం చేసింది.
కేంద్రంలోని బిజెపి సర్కారు ఎనిమిదిన్నరేండ్ల కాలంలో అనుసరించిన విధానాల వల్ల ఆర్థిక వృద్ధి మెరుగుపడకపోగా… మరింత దిగజారిందనే విషయాన్ని ఆర్థిక సర్వే నివేదికలోని గణాంకాలు స్పష్టం చేస్తున్నా••. ఫలితంగా ప్రజల జీవన ప్రమాణాలు, స్థితిగతులు దారుణంగా దెబ్బతింటూ వస్తున్నా••. దేశంలో ఒక్క పూట కూడా తిండి తినలేని వారి సంఖ్య 23 కోట్లుగా ఉందంటే… పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు గతంలో 20 శాతంగా ఉంటే… ఇప్పుడు ఆ శాతం ఏడుకు పడిపో••ంది. ఈ పరిణామాలన్నిటి రీత్యా… మోడీ సర్కారు అనుసరిస్తున్న విధానాలు.. ప్రజల సంక్షేమం, దేశ ఆర్థికాభివృద్ధి కోసం కాకుండా కొంత మంది వ్యక్తులు, కార్పొరేట్‍ శక్తులకే ఎక్కువగా ఉపయోగపడుతున్నాయనే విషయం సుస్పష్టమవుతున్నది.


పాతాళానికి పారిశ్రామికం :


దేశంలో పారిశ్రామికోత్పత్తి పడకేసింది. ఈ ఏడాది అక్టోబర్‍లో మైనస్‍ 4 శాతానికి పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపి) పతనమైంది. గడిచిన 26 నెలల్లో ఇదే అత్యంత కనిష్ఠ స్థా•• కావడం గమనార్హం. ఇటీవల విడుదలైన కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాల్లో భారతీయ పారిశ్రామిక కార్యకలాపాలు అంతంత మాత్రంగానే సాగుతున్నట్టు తేలింది. వ•ఖ్యంగా తయారీ రంగం ఉత్పత్తి క్షీణించడం, గనుల రంగంలో వృద్ధి మందగించడం, విద్యుదుత్పత్తిలోనూ నిస్తేజం అవరించడం జరిగింది. జాతీయ గణాంక కార్యాలయం(ఎన్‍ఎస్‍ఒ) ప్రకటించిన ఐఐపి వివరాల ప్రకారం తయారీ రంగం వృద్ధిరేటు ఈ అక్టోబర్‍లో మైనస్‍ 5.6 శాతానికి దిగజారింది. నిరుడు ఇదే నెలలో 3.3 శాతం వృద్ధిని కనబర్చింది. ఇక గనుల రంగంలో వృద్ధి కేవలం 2.5 శాతానికి, విద్యుదుత్పత్తిలో 1.2 శాతం, ప్రైమరీ గూడ్స్- మౌలిక/నిర్మాణ రంగ ఉత్పత్తులు 1 శాతానికి మాత్రమే పరిమితమైంది.
2020 ఆగస్టలో ఐఐపి మైనస్‍ 7.1 శాతానికి పడిపో••ంది. మళ్లీ ఆ తర్వాత ఈ ఏడాది అక్టోబర్‍లోనే అత్యంత దారుణంగా దిగజారింది. నిజానికి గత ఏడాది అక్టోబర్‍లో ఐఐపి 4.2 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. అ••తే ఈసారి మాత్రం తీవ్రంగా నిరాశపర్చింది. క్యాపిటల్‍ గూడ్స్ ఉత్పత్తి తీరు కూడా 2.3 శాతం తిరోగమనంలోకి జారుకున్నది. నిరుడు కూడా ఇది మైనస్‍ 1.6 శాతంలోనే ఉండగా, ఈసారి అంతకంటే ఎక్కువగా నీరసించింది. అలాగే కన్జ్యూమర్‍ డ్యూరబుల్స్ మైనస్‍ 13.4 శాతానికి పడింది. ఇంటర్మీడియెట్‍ గూడ్స్ ఉత్పాదక రేటు సైతం మైనస్‍ 2.8 శాతంలోకి జారుకోవడం గమనార్హం.


జిడిపి వృద్ధి 4.4 శాతమే :
కరోనా తర్వాత అనూహ్యంగా పెరిగిన డిమాండ్‍తో ఒక్కసారిగా వేగం పుంజుకున్న భారత ఆర్థిక ప్రగతి చక్రం… మళ్లీ నత్తడనకన సాగుతోంది. వరుసగా రెండు త్రైమాసికాలుగా వృద్ధి తగ్గుతూ వస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో సెప్టెంబర్‍తో వ•గిసిన రెండో త్రైమాసికం (క్యూ2)లో 6.3 శాతానికి జారుకున్న జిడిపి వృద్ధి రేటు.. డిసెంబర్‍తో వ•గిసిన వ•డో త్రైమాసికంలో (క్యూ3) మరింత తగ్గి 4.4 శాతానికి పరిమితమైంది. వస్తు తయారీ రంగం పేలవ పనితీరుతో పాటు అధిక వడ్డీ రేట్లు గిరాకీకి గండి కొడుతుండటం ఇందుకు కారణమైంది. జాతీయ గణాంకాల కార్యాలయం(ఎన్‍ఎస్‍ఓ) మంగళవారం విడుదల చేసిన డేటా ప్రకారం.. ఈ క్యూ3లో స్థిర(2011-12) ధరల ఆధారిత జిడిపి లేదా రియల్‍ జిడిపి రూ.40.19 లక్షల కోట్లుగా ఉండవచ్చని అంచనా. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో నమోదైన రూ.38.51 లక్షల కోట్ల జిడిపితో పోలిస్తే 44 శాతం అధికమిది.


దిగజారిన ఉపాధి :
భారత దేశ ఉపాధి రేటు ఇటీవలి కాలంలో దాదాపు 42 శాతం కనిష్ట స్థా••కి పడిపో••ంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్‍ఒ) సమాచారం ప్రకారం.. ఆర్థికవ్యవస్థల్లో భారతదేశం ఉపాధి రేటు చాలా తక్కువగా ఉన్నదని ఐఎల్‍ఓ చెప్పింది. లేబర్‍ పార్టిసిపేషన్‍ రేటు(ఎల్‍పిఆర్‍) అనేది ఆర్థిక వ్యవస్థలో ఎంత మంది ఉపాధి పొందగల వ్యక్తులు ఉన్నారు. వాస్తవానికి పనికోసం వెతుకుతున్నారని అనేది అర్థం. సెంటర్‍ ఫర్‍ మానిటరింగ్‍ ఇండియన్‍ ఎకానమి(సిఎంఐఇ) సమాచారం ప్రకారం.. భారతదేశ ఎల్‍పిఆర్‍ ఈ ఏడాది మార్చిలో 41.38 శాతం (దాదాపు ఐఎల్‍ఓ గణాంకాల లాగానే)గా ఉన్నది. కానీ, ఇది గత నెలలో 40.15 శాతానికి పడిపోవడం గమనించాల్సిన అంశం.


భారతదేశంలో 60 శాతం మంది ఉపాధి పొందగల వ్యక్తులు జాబ్‍ మార్కెట్‍ నుంచి పడిపోయారు. అ••తే, ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందన్నది ఆర్థిక నిపుణుల అభిప్రాయం. ఇటీవలి కాలంలో ఎల్‍పిఆర్‍లో అసాధారణ క్షీణతపై పాలకులు పెద్దగా దృష్టి పెట్టలేదని సిఎంఐఇ సిఇఓ మహేశ్‍ వ్యాస్‍ అన్నారు. సిఎంఐఈ ప్రకారం.. 2017 మార్చిలో ఎల్‍పిఆర్‍ 47 శాతంగా ఉన్నది. ఇది కేవలం నాలుగు ఏండ్లలో 40 శాతానికి పడిపో••ంది. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాంతో పాటు ఇతర ఆసియా ఆర్థిక వ్యవస్థలలో 60 శాతం కంటే ఎక్కువ మంది ఉపాధి పొందగల వ్యక్తులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక భారత్‍ విషయానికొస్తే… ఇక్కడ దాదాపు వంద కోట్ల మంది ఉపాధి పొందగలిగే వ్యక్తులున్నారు. కానీ ఇందులో 40 కోట్ల మంది (40 శాతం మంది)కి మాత్రమే అవకాశాలున్నా••.


కేంద్ర ప్రభుత్వ అనాలోచిత, అర్థరహిత నిర్ణయాల వల్లనే దేశ ఆర్థిక వ్యవస్థ తిరగోమనంలో కొనసాగుతున్నది. మోడీ అనాలోచిత నిర్ణయం వల్లనే దేశంలోని ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా••. నోట్ల రద్దు, జిఎస్‍టి, కరోనా వల్ల సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలతో పాటు భారీ పరిశ్రమలు సైతం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా••. లక్షల పరిశ్రమలు వ•తపడ్డా••. నిరుద్యోగం పెరిగింది, ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది. 2016-19 మధ్యకాలంలో సుమారు 50 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. పాలకుల దోపిడీ విధానాల వ•లంగా ప్రజల్లో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నా••. సామాన్యుల వినియోగ సామర్థ్యాన్ని ఇనుమడింపజేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంపైనా కేంద్రం తగినంతగా దృష్టి సారించలేదు!

Leave a Reply