బుక్కెడు బువ్వ కోసం
కార్డు కోసం క్యూ కట్టాలి
మోదీ గ్యారంటీ అన్న యోజన
అంటూ చప్పట్లు కొట్టాలి
‘ఉజ్వల’తో నిప్పు రాజేస్తే
పళ్లెంలోకి బువ్వ చేరుతోంది
మోదీ స్మరణతో పొట్ట నింపాలి
చీకట్లో, ముఖం చాటేసుకొని
సిగ్గుతో బజార్లో దొడ్డికెళ్లక
తప్పని దిక్కుమాలిన జీవితాల్లో
శాచాలయం మోదీ గ్యారంటీ
తల దాచుకోవడానికి నీడ
కరువైన జీవితాల్లో ప్రధాన మంత్రి
అవాస్ యోజనతో సంసారం చేయాలి
సమాన హొదా అంటూ
సర్పంచు పదవులతో
నారీ శక్తికి వందనం అంటూ
చట్ట సభలలో రిజర్వేషన్లతో
అందలం ఎక్కిస్తున్నారు
నిర్భయను మరిచిపొమ్మంటున్నారు
హథారాస్ మనది కాదంటున్నారు
కశ్మీర్‌కు అలా జరుగాల్సిందే అంటారు
మణిపుర్లో ఆడపడచుల నగ్న ఊరేగింపు
మోదీకి ఒక రాజకీయం!
దండకారణ్యంలో పోరాడే ఆదివాసీలపై
అత్యాచారాలు తప్పు కాదంటారు
హాస్దేవ్ను అడ్డుకుంటే
మోదానీకి చిచ్చుపెట్టారంటారు
మోదీని కాదంటే, జై శ్రీరాం అనకుంటే
దేశంలో చోటుండదు, జీవితానికి హామీ లేదు
హిందూ హృదయ సామ్రాట్ అనుగ్రహిస్తే
అన్నీ వాషింగ్ మిషన్ పవిత్రం చేస్తుంది
కాదని విమన్ ఎంపవర్మెంట్ అంట
మణిపుర్ మహిళలవుతారు
దండకారణ్య బిడ్డలవుతారు
కశ్మీర్ ఉగ్రవాదులవుతారు
మోదీషా కళ్లల్లో నలుసవుతారు
మోదానీకి టార్గెటవుతారు
కార్పొరేటీకరణను, సైనికీకరణను
ఎదిరించని సాధికారత
హిందుత్వకు లొంగిపోవడమే.
(8 మార్చ్ అంతర్జాతీయ మహిళా దినం సందర్భంగా)
Related