డెబ్బై ఏళ్ళ తెలుగు రాష్ట్రం రెండు బలమైన ఉద్యమాలను చూసింది.ఒకటి నక్సల్బరీ రెండు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం. సిద్దాంత రిత్యా రెండూ వైరుధ్యమైన ఉద్యమాలు అయినప్పటికీ రెండు ఉద్యమాలూ సుధీర్గ కాలం నడిచాయి. ఎన్నో నిర్భందాలు ఎదుర్కొన్నాయి అవి ఒక దానికి మరొకటి సంబంధ భాంధవ్యాలను కలిగి ఉంది. తొలివిడత తెలంగాణ మిగిల్చిన అసంతృప్తుల దావాలనమే నక్సల్బరీ ఉద్యమాన్ని కొనసాగించాయి. ప్రత్యామ్నాయ రాజకీయాలు కోరుకున్న ప్రతి గొంతూ ఈ రెండు ఉద్యమాలను గుండెలకు హత్తుకున్నాయి. ఇది పోరు భూమి, ఆట పాట సైదోడై కదన రంగాన్ని కవాతు తొక్కేలా చేసాయి. సీమాంధ్ర దోపిడీ సాంస్కృతిక అభిజాత్యం పాలకుల నిర్లక్ష్యం నీళ్ళు నిధులు నియామకాల లో దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయాలకు ఎదురొడ్డి నిలబడ్డది తెలంగాణ సమాజం. అందుకేనేమో తరాల అణచివేత దోపిడీ పీడన వివక్ష ఎక్కడున్నా ఆ ప్రజల భావోద్వేగాలు వర్తమాన సమాజాల కంటే భిన్నంగానే ఉంటాయి . చరిత్రలో అవి అరుదుగా అప్పుడప్పుడూ బయటపడతాయి . ఒక ప్రాంత విముక్తికోసం వందలాదిగా సామూహిక హననం చేసుకున్న దుష్టాంతాలు అరుదు. అక్కడక్కడా శత్రుదేశాల బారినపడకుండా ఆత్మాహుతి చేసుకున్నవి, మతపరమయిన బలిదానాలు మినహాయిస్తే, తెలంగాణాలో మొఘలాయీలకు బందీగా చిక్కిన ప్రతాప రుద్రుడు నర్మదా నదిలో దూకి చనిపోయిన వైనం వెనక ఓటమిని జీర్ణించు కోలేని బలహీనత చరిత్రలో మనం విన్నాం . సమ్మక్క సారలమ్మ లు కాకతీయులతో పోరాడి జంపన్న వాగులో ఒరిగిన అమరత్వం మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతూనే ఉంది.
బహుశా ఒక ప్రజాస్వామిక ఉద్యమానికి ఇంత -బాధిత చరిత్ర ఉండడం అరుదైనది. మొత్తానికి దశాబ్దాల కల నెరవేరింది. బలమైన ప్రజాస్వామిక ఉద్యమాల పునాది నుండి పడిలేస్తూ ఫీనిక్ష్ పక్షిలా పడిలేచిన ఉత్తంగా తరంగం తెలంగాణ. సకల జనుల శక్తి సాకబోస్తే నే తెలంగాణ అనే సుదీర్ఘ కల సాకారం అయ్యింది. నాలుగున్నర దశాబ్దాల నిరవదిక తపన తండ్లాట తెలంగాణ. సకల రంగాలు సబ్బండ కులాలు తమకు తాము నచ్చిన రీతిలో ఉవ్వెత్తున లేచిన ఉద్యమవాదంలో సమిధలు అయ్యారు సాయుధులు అయ్యారు. అమరులు అయ్యారు. ఎందరో అనామకులుగా తమ చెమట నెత్తురు సాకబోసారు. కవులు, మేధావులు, ఉద్యమకారులు, విద్యార్ధులు శ్రామికులు ఉద్యోగులు సమస్త రంగం ఒక్క తాటి పై నిలబడి మృత్యువుని దిక్కరించి సాధించుకున్న తెలంగాణ ఇప్పుడు ఎలా ఉంది ?
ఒకటి నిజం విద్యార్ధి శక్తి తోనే తెలంగాణ నడిచింది వాళ్ళ బలిదానాల తోనే లక్ష్యం సాకారమైనది. దానివెనక దశాబ్దాలుగా నెరవేరని లక్ష్యం ఉంది, బాధిత గొంతు ఉంది. తెలంగాణలో పుట్టిన ప్రతి విద్యార్ది బాల్యం జీవితం నిత్యకల్లోలాలతోనే గడిచింది. తన యవ్వనం ఆకలి, అంటరాని తనం మధ్య, విశ్వవిధ్యాలయ చదవు ఒక సైనిక పహారామధ్య నడిచింది. నగరం అంతా పోలీసుల డేరాలతో శత్రు దేశాల మధ్య ఉండాల్సిన మిలటరీ పద గట్టనల మధ్య గడిచింది ,హాస్టల్ మూసి వేతతో చీకటి గదుల మధ్య ఆకలి కడుపులను ఎండబెట్టిన వైనం. ఒక భద్రత లేని పరిస్థితుల మధ్య బిక్కు బిక్కుగా గడిచింది. అదో మానసిక ఉక్కపోత ,చీటికి మాటికి కేసులతో నీడలా వెంటాడిన ఒక భయానక స్థితుల మధ్య కొట్టు మిట్టాడిన విద్యార్ధి తెగింపు ఉద్యమ కారుల త్యాగమయ జీవితం గెలుపుని ముద్దాడింది. యాభై ఏళ్ళ కింద మొదలైన తెలంగాణ ప్రధాన లక్ష్యం నీళ్ళు నిధులు నియామకాలు. దశాబ్దాల సీమాంధ్ర దోపిడీ నుండి విముక్తమైన తెలంగాణ గడిచిన తొమ్మిదేళ్ళ పాలన లో నీళ్ళు, నిధులు, నియామకాల లో అనుకున్న లక్ష్యాలకు అనుగుణంగా నే ప్రయాణం సాగుతున్నదా అనే ప్రశ్న ఇప్పుడు తెలంగణ బుద్ధిజీవులను విద్యార్ధి, కార్మిక, కర్షక లోకాన్ని పట్టి పీడిస్తున్నది. మనం అనుకున్న బౌగోళిక తెలంగాణ అయితే సాకారం అయ్యింది కానీ ప్రజాస్వామిక తెలంగాణ సాధన ఇంకా మొదలు కావాల్సే ఉంది.
వేలాది మంది అనుభవించిన నిర్భందాలు వందలాది బలిదానాల తో సాకారం అయిన తెలంగాణ లో అదే సీమాంధ్ర దోపిడీ తిష్టవేసుకుని కూర్చుంది. పోరాడిన ఉద్యమకారులు వీధిన పడ్డారు. నిర్భందాలకు కారణమైన సీమాంధ్ర పార్టీల మిలాఖత్ తో దోపిడీలు చేసిన దొంగలు చీమలు పెట్టిన పుట్టల్లో జొరబడ్డారు. ఇప్పుడెలా ఉంది తెలంగాణ. ఒక నాడు రూమీ టోపీ పోయి గాంధీ టోపీ వచ్చినట్టు. సీమంధ్ర దోపిడీ స్థానం లో స్థానిక పెత్తందారుల దోపిడీ మరింత తీవ్రతరం అయ్యింది. దానికి సీమాంధ్ర పెత్తందారీ తనం మిలాఖత్ అయ్యింది.అవే దోపిడీ శక్తులు ఇక్కడ తిష్టవేశాయి. చాట్ల తవుడు బోసి కుక్కల పాలు చేసినట్టు అయ్యింది తెలంగాణ దాని మూలంగా అటు విద్యార్ధి లోకాన్ని ఉద్యమ కారులను మరింత కుంగ దీసింది.రైతు ఆత్మహత్య లు ఆగలేదు. విద్యార్ధుల ఆశలు నిరాశలు అయ్యాయి. ఇటీవల జరిగిన సర్వీస్ కమీషన్ పరీక్షల్లో జరిగిన అవకతవకలు యవజన లోకాన్ని మరింత కుంగ దీసింది. నిష్పాక్షకంగా జరపాల్సిన పరీక్షలు అంగటి సరుకు అయ్యాయి. ఈ నాటికీ వాటి వెనక ఉన్న అసలు దొంగలను గుర్తించలేదు.
ప్రజా పౌర హక్కులు హరించుకుపోయినాయి. చివరికి ధర్నా చౌక్ ని కూడా తరలించే ప్రయత్నం జరిగింది. బంగారు తెలంగాణ లో ఉద్యమాల అవసరమే లేదనే లా పాలకులు తెలంగాణ పౌర సమాజాన్ని మభ్యపెట్టారు. జలయజ్ఞం పేరుతో కోట్లాది రూపాయల సొమ్ము అన్యాక్రాంతం అయ్యాయి. ప్రాజెక్ట్ ల పేరుతో వేలాది మందిని విస్తాపితులు చేసారు. ఏడు మండలాలను ఆంధ్రా లో కలిపేసారు. ఒకప్పటి ఆటా మాట బంద్ అన్న రీతిలోనే ఇప్పుడు పాలన సాగుతుంది. దళిత ముఖ్యమంత్రి నినాదం మరుగున బడి నూటా యాభై ఎత్తుల విగ్రహాల లో సంక్షేమాన్ని చూపే తెంపరితనం. దళితులకు మూడెకరాల భూమి హామీని తుంగలో తొక్కారు. ధరణి పేరుతో భూ దోపిడీకి దార్లు తెరిచారు. ఒక నాడు ముందు భౌగోళిక తెలంగాణ సాకారం అయ్యాక ప్రజాస్వామిక తెలంగాణ కోసం కొట్లాడదాం అనుకున్నది యవత. ఇప్పుడు తెలంగాణ ను దోపిడీకి నిలయంచేసారు పాలకులు. మనం కోరుకున్న అమరుల లక్ష్య సాకారం కోసం మరో ప్రజాస్వామిక పోరాటాన్ని కొనసాగించాల్సిన చారిత్రిక అవసరం మనందరి మీదా ఉంది. అప్పుడు మాత్రమె త్యాగాలు చేసిన విద్యార్ధుల బలిదానాలకు ఒక నిష్కృతి
Kiran ji —agree with u sir—- we need one more udyamam —-dopidi — hakku ayipoyindhi—
King kcr — raajula paalana —-family raajarikam ???