శవాలపైన భవంతులు కట్టి
బంగారు పళ్ళెంలో
పంచభక్ష్య పరమాన్నాలు తినే
దొరలుగల్ల దేశంలో
ఏది ప్రజాస్వామ్యం

రెడ్ కార్పెట్ వేసి
కుక్కల్ని పిలిచి
తల్లి దేహాన్ని
ముక్కలుగ నరికి
విందునేర్పరిచే
గుంట నక్కలున్న
ఈ రామ రాజ్యంలో
ఏది ప్రజాస్వామ్యం

సైన్సును సాగిలబడేసి
నాన్ సైన్స్ను
నాన్సెన్స్ల
చేతుల బెట్టిన
నపుంసకులెలే
ఈ దేశంలో
ఏది ప్రజాస్వామ్యం

ప్రశ్నించే
ప్రజాస్వామ్యం
అని చెప్పి
ఉపా చట్టాలు బెట్టి
అండా సెల్లులో
జీవితాలను
అంధకారం
చేస్తున్న ఈ దేశంలో
ఏది ప్రజాస్వామ్యం

మూడత్వం
మురుగు నీటిలో
దైవత్వం
దయా దక్షిన్యాలతో
ఉపొంగుతూ ప్రవహిస్తున్న
శవాల కాల్వలున్న
ఈ దేశంలో
ఏది ప్రజాస్వామ్యం

Leave a Reply