కొన్ని మాటలకు నరం ఉండదు
గురిపెట్టి వదిలాక
చిల్లం కల్లమైన ఒక నెత్తుటి నేల
విలవిలలాడుతూ ఉంటుంది
గుండె నిండా విషం నింపుకున్న
ప్రేమ ఒలకబోయడం
నెత్తుటి మైలురాళ్ళకు తెలియదనుకుంటావు
ఒక సంకుచిత రాజకీయ ఆవరణంలో
అజ్ఞాతం వీడిన నేల సంబరం
నీ కళ్ళకు దృశ్యం కాకపోవచ్చు
ఒకరో ఇద్దరో పార్లమెంటుభవనమో
మొలకెత్తలేదు
పన్నెండు వందల ప్రాణాలు పోసి
నిర్మించుకున్న కల
కోట్ల హృదయ ధ్వనుల సంగమ స్థలి
ఈ రోజులు పరిమళించకపోవచ్చు
ఈ కాలం వేదనై మిగలవచ్చు
ఈ ఉదయం నిరాశై వెలగవొచ్చు
ఈ నేల దుఃఖ రాసిగా ఉండవొచ్చు
ఒకరోజును
మండే నెత్తురు పరిమళిస్తుంది
ఒక కాలాన్నిఆనందంగా
పొలం నుండి రైతులు
భుజం మీద మోసుకు వస్తారు
ప్రజలు
ఒక ఉదయం
ఊహ కందని ఆశలు ఉదయిస్తారు
ఒక ఆకుపచ్చని సందేశమై
తెలంగాణ
దుఃఖ భూమిని ఆవరిస్తుంది
11-02-2౦22
ఒక ఆకు పచ్చని సందేశమై