ఎక్కడో
ఒక తల్లి కన్న
పేగు తెగింది..
తండ్రి ఆశలు ఆవిరి అయ్యాయి..
అమ్మ,నాన్న వస్తారు
ఏదో తెస్తారని
ఎదురు చూసే చూపులు
వాళ్ళు రాలేరన్న వార్త విని
ఎక్కి ఎక్కి ఏడ్చాయి.

అవి
కుటుంబం కోసం కూలి పనికి
దేశం మొత్తం సంచరించే వలస
జీవితాలు..
ఇప్పుడు మన నేతలు
వాటికి లెక్కలు వేస్తారు,
బాగానే ఉంది..

అమ్మ కడుపు కోతకు..
నాన్న కన్నీళ్లకు..
పసి పిల్లల భవిష్యత్తుకు..
సమాధానం చెప్పేదేవరు..?
ఈ మారణఖండకు కారణం ఎవరు..?
వాళ్ళ బాధలో భాగంగా..😰
(ఒడిశా రైలు ప్రమాదం పై)

03.06.2023

Leave a Reply