ఎప్పుడో ఏదో ఒక
క్షణాన కమ్ముకున్న చీకట్లు
తొలగిపోక మానవు
రాబందుల రెక్కలలో
చిక్కిన పావురాలు
ఆకాశంలో ఎగరక మానవు
వెనక్కి విరిచేసి సంకెళ్ళేయబడ్డ
మణికట్లు మరల పిడికిలెత్తి
అభివందనం చేయక మానవు
ఓరిమితో ఎదురు చూడాలి
సమయమింకా ముగిసి పోలేదు
అందరమూ మరొకసారి
కలుసుకొని కదిలే కాలమే ఇది!!
(దేవాంగన, నటాషా, ఆసిఫ్ ఇక్బాల్ లకు బెయిల్ వచ్చిన సందర్భంగా)