కామ్రేడా…. ఆర్‌కే
అమరులు అస్తమయంలోనుంచే
ఉదయిస్తారనే మాటను
మొన్ననే మేము కళ్లారా చూశాము.
ఆర్‌కే అమడయ్యాడనగానే
ఎన్ని హృదయాలు
అయ్యో..
ఆ మాట అబద్ధం అయితే బాగుండని
తల్లడిల్లయో
సరిగ్గా అప్పుడే చూశాము
కామ్రేడా..
నీవు మరణిస్తూనే
రెట్టింపు వెలుగుతో
ఉదయిస్తూన్నావని
అస్తమయం క్షణకాలమని
అది వేన వేల వెలుగుతో
అరుణోదయం తప్పదని
కామ్రేడా..
మేము మొన్ననే చూశాము
ఉక్కు సంకల్పంతో
నువ్వు హామీపడ్డ మాటని
నేలకొరిగి నెరవేర్చినప్పుడు
“జీవిస్తాం జీవిస్తాం ప్రజల కోసమే జీవిస్తాం
మరణిస్తాం మరణిస్తాం ప్రజల కోసమే మరణిస్తాం” అని
నీవు హామీపడ్డ మాటను
ఆలింగనం చేసుకున్నప్పుడు
కామ్రేడా….
మేము మొన్ననే చూశాము
కోట్లాదిమంది ప్రజానీకం కన్నీళ్లతో
నీ అమరత్వపు జాడను వెతికినప్పుడు,
పీడిత ప్రజానీకం ఆర్‌కే అమర్ రహే
అని నినదించిన
ప్రతి నినాదం నుండి
నీవు ఉదయించడాన్ని