హక్కులు వచ్చాయని
ఆనందపడే వాళ్ళు
అరడజను అయితే..

హక్కంటే ఏంటో
తెలియక పూట తింటే
మారు కూటికి లేనోల్లు 94 మంది..

ప్రజలను పాచికలు చేసి
ఆడిన ఈ చదరంగంలో
హక్కుల కాలరాసేవాడు “రాజకీయనాయకుడ”య్యాడు
వాటి కోసం గొంతు చించేవాడు
“రాజకీయ ఖైదీ” అయ్యాడు

ఇదే గణతంత్రం
నేటికి ఈ ఘనమైన “తంత్రం”
ఏంటో అర్థం కాక బలి పశువైతున్నది మనమే..

చీకటి నిండిన
ఈ మాయాజాలం లో
నక్షత్రాల వెలుగు వచ్చేదెప్పుడో..!

(72 ఏండ్ల గణ”తంత్ర” రాజ్యం పై)

Leave a Reply