నన్ను క్షమించండి...
మీ కోసం జోలపాట ఎలా పాడాలో తెలీటం లేదు.
మనం ఒక పని చేద్దాం.. దిశల లెక్కలు తేల్చే భౌతిక శాస్రం నాశనం అవ్వాలని ప్రార్థిదాం !
నిదుర పోతున్న పిల్లల మీద శత్రువు వదిలే ద్రోణులు.. బాంబులు గురి తప్పిపోవాలని ప్రార్థిదాం !

నన్ను క్షమించండి ..
చనిపోయిన నా గాజా పసి పిల్లలారా..
మిమ్మల్నెలా నిద్ర లేపాలో అర్థం కావటం లేదు.
మీతో పాటు నేనూ చచ్చి పోయాను !

నన్ను క్షమించండి..
ఈ ప్రపంచం తనని తాను విముక్తి చేసుకోవడానికి మన రక్తాన్ని మరింతగా కోరుకుంటోంది !
నా ప్రియమైన గాజా పిల్లలారా ఆశను కోల్పోకండి...
త్వరలోనే తుపాకీ కాల్పులే లేని రోజు తప్పక వస్తుంది.
మీ తల్లిదండ్రుల వైపు చూడండోసారి..!వాళ్ళు సూర్యుణ్ణి ఎలా ఎత్తి పట్టుకున్నారో..?
చూసారా..ధైర్యంగా ఉండండి !

3 thoughts on “గాజా పసిపిల్లలు! Children of Gaza

    1. పై రచయిత గారు మీ ఈ రచనకు
      తగు జవాబిస్తే సబబుగా ఉంటుంది.

    2. Why is the article writer silent in replying to Syamala Tadigadapa’s responsive article? Isn’t it her responsibility? Avoiding only confirms her inability justifying her writeup, meaning Syamala Tadigadapa is RIGHT. Right?

Leave a Reply