మీకెవరికీ ఎప్పటికీ అర్థం కాదు. బయటకు కనిపించే అందమైన ముఖం వెనక ఉన్న నా హృదయం ఉపిరాడానంతగా మూసుకుపోయిందని. చిక్కని మీసాల కింద కోరిక అణిచివేయబడింది. మీరు విధించిన నిషేధ ఫత్వాల మధ్య నా ఆకాంక్షలు ఉరిపోసుకున్నాయి. ఇక ఎప్పటికీ ఎవరితోనూ .మధురమైన ముద్దు పెట్టించుకోలేను.. మరెవరితోనూ ప్రేమించబడలేను ! నా ప్రేమ అసహ్యించుకోబడుతుంది. ఎవరితోనూ దాన్ని ఇచ్చిపుచ్చుకోలేను. నా ఒకే ఒక్క జీవితంలో నా ప్రేమ వృధాగా.,ఈ అనంతమైన లోకంలో ఏకాకిగా మిగిలిపోతుంది. అయినా...మరోసారి గట్టిగా చెబుతున్నాను వినండి..అవును ! నేను 'గే' ని. అలాగ ఉండిపోవడమే నాకు ఇష్టం. ఎంత దుఖఃమైనా సరే...! అసలు ఈ పాపాత్ములైన భక్తుల్ని, క్రూరమైన ఫత్వాలు విధించే వారిని., వెలివేయబడ్డ చర్చ్ లను ఎప్పుడు.. ఎక్కడ చూసినా పగలబడి నవ్వాలనిపిస్తున్నది. అయినా..మీదైన భూగోళంలోనే నేను ఒక తప్పుడు మనిషిని కదా.. ఎప్పటికీ ఎవరితోనూ అర్థం చేసుకోబడనివాడిని అందుకే ..నేను అంగీకరిస్తున్నా ! అవును.. ఖచ్చితంగా నేనొక 'గే' ని ! మీ దృష్టిలో ఒక తప్పుడు మనిషిని..మీతో కలిసి ఉండకూడని వాణ్ణి. కానీ .. వినండి! అది కేవలం మీ ప్రపంచంలో మాత్రమే! బహుశా.. దయతో నిండిన ఆ దేవుని కళ్ళల్లో మాత్రం ఉండవలసిన వాణ్ణే ! అవును..నేను 'గే'ని !

Gay —so what //nothing is wrong —just it is a biological thing -needs RESPECT —UNDERSTANDING