చంద్ర‌ ఆమెను కలిసినప్పుడు చంద్రికకు ఎనిమిది సంవత్సరాలు. 

అప్పుడు కూడా, అతనికి ఎప్పుడూ చూడని అందమైన అమ్మాయిగా తను  కనిపించింది. అతని తండ్రికి నగరం వెలుపల  సిమెంట్ తయారు చేసే ఫ్యాక్టరీలో కొత్త ఉద్యోగం వచ్చింది.  తన అమ్మ,  నాన్నలతో కలిసి ఇళ్లు మారాడు. ఇల్లు ఒక అడవి అంచున కూర్చుంది. అది అతని చిన్నతనంలో అమ్మమ్మ చెప్పిన కథల్లో మాదిరి అనిపించింది.  గుబురు చెట్లు, ప్రకాశవంతమైన ఎరుపు,  ఆకాశపు నీలిరంగు స్పర్శతో సాయంకాలం చెట్లకు అసహజ రంగులు వచ్చేవి.

ఇది దాదాపు మాయాజాలం అనిపించే రకమైన అడవిగా అతను భావించే వాడు.

చంద్ర తన ఇంటి నుండి ఒక సాయంత్రాన్ని అన్వేషించడానికి నిర్ణయించుకున్నాడు. అతను పరిగెత్తే టప్పుడు ఒక చెట్టు మొదలు మీద పడి తన మోకాలిని కొట్టు కున్నాడు. అతని వయస్సులో వున్న చంద్రిక అప్పుడే ఒక చెట్టు వెనుక నుండి అతనికి కనిపించింది.

ఆమె తన చీకటి కళ్ళతో వింతగా చూసింది. ఆమె జుట్టు వదులుగా ఉండి ఆమె భుజాలపై పడింది. అతను రక్తం కారుతున్న అతని మోకాలిపై ఉన్న గాయంపై ఆమె చూపులు తాకాలని వృథా ప్రయత్నం చేసాడు.  ఆమె ముఖం మీద ఆందోళన పాకింది. కానీ ఆమె ఏమీ అనలేదు. ఆమె నెమ్మదిగా వెనక్కి తిరిగి దూరంగా నడవసాగింది. ఏమనుకుందో ఏమో మళ్ళీ అతని దగ్గరికి వచ్చి నిలబడింది

 “నాకు నిజంగా నొప్పి లేదు” పంటి బిగువున నొప్పి భరిస్తూ చంద్ర నసిగాడు.

ఆ అమ్మాయి ఆగి అతని వైపు తిరిగింది.  ఆమె కళ్ళు వెడల్పు అయ్యాయి.

 “నువ్వు నాతో మాట్లాడుతున్నావా?” ఆమె మృదువైన స్వరంతో అడిగింది.

చంద్ర  తన మోకాలి రక్తాన్ని చేతితో తుడుచుకున్నాడు.

 “నేను ఇక్కడ మరెవరినీ చూడలేదు. నువ్వు ఇక్కడ ఉంటున్నావా? ” చంద్ర అడిగాడు.

 ఆ అమ్మాయి కళ్ళు ప్రశాంతతను సంతరించుకున్నాయి. అంతకుముందు విశాలంగా తెరిచిన తన నోరు చిరునవ్వుగా ఏర్పడింది.

“నువ్వు నాతో ఆడుతావా ?” చంద్రిక ఇవేమీ పట్టనట్టు అడిగింది.

 వారి స్నేహం ప్రారంభమైంది.  చంద్రిక తన కుటుంబంతో కలిసి అడవి దగ్గరి గ్రామంలో  ఒక చిన్న ఇంట్లో నివసించేది. ఆమె ఒక్కటే సంతానం. ఆ రోజు, వారు చెట్ల మధ్య ఒకరినొకరు వెంబడించారు.  చెట్ల ఆకులు వెన్నెల్లో మెరుస్తున్నట్లు వారు గమనించారు.

వారి ఆటలు ఎక్కువ వెన్నెలలోనే సాగేవి. చంద్ర ప్రతిరోజూ రెండు వారాల పాటు సాయంత్రం వరకు చంద్రిక ఇంటి వరకు అనుసరించే వాడు. అది పాత  ఇటుకలతో చేసిన ఇల్లు.

” అమ్మ,  నాన్న నేను ఎవరినీ ఇక్కడికి తీసుకురావాలని అనుకోరు”  తను చెప్పింది.

“ఎందుకు అలా ?” చంద్ర అడిగాడు.

“నాకు తెలియదు,” తన సాధారణ చిరునవ్వును విరిచేస్తూ అంది.

 “నువ్వు  నా స్నేహితుడివని  నేను వారికి చెప్పాను.” చంద్రిక తన ఇంటి ముందు తలుపు వైపు నడిచింది.

తలుపు తెరిచినపుడు, కొంచెం నలుపు, తెలుపు రంగు పొడవాటి గడ్డంతో పెద్ద మనిషి బయటకు వచ్చాడు. చంద్రని చూడగానే ఆ వ్యక్తి అడిగాడు. 

  “నువ్వు ఇక్కడ ఎక్కడ వుంటావు ?”

“నాన్నా, తను నా స్నేహితుడు,” చంద్రిక చెప్పింది.

చంద్రికను పట్టించుకోకుండా, చంద్ర  వైపు చూపులు వేసి, పెరట్లోకి వెళ్లి పోయాడు. చంద్రిక రూపుతో సరిపోయే మహిళ అతని వెనుక నుండి వచ్చింది.

“బాబు నువ్వు ఇంటికి వెళ్ళు. వెంటనే వెళ్ళు” చంద్రిక అమ్మ కాస్తంత నెమ్మదిగా అంది.

“నన్ను క్షమించండి,” చంద్ర చెప్పాడు.

 “నేను ఇక్కడకు రాకూడదని చంద్రిక చెప్పింది”.

“చంద్రిక లోపలికి రా” ఆమె చంద్రిక వైపు చూపులు తిప్పే ముందే చెప్పింది.

చంద్రిక కళ్ళ మూలల్లో కన్నీళ్ళు ఏర్పడటాన్ని చంద్ర చూసాడు.  అతని  కాళ్ళు  నొప్పి పుట్టేంతవరకు  ఆ ఇంటి నుండి దూరంగా, వేగంగా పరిగెత్తాడు.

అతను  ఆమెను మళ్ళీ చూడలేదు. అతను మళ్ళీ అడవిలోకి వెళ్ళలేదు.  ఆమె ఇంటి దగ్గరకు వెళ్ళడానికి అతను భయపడ్డాడు.

 ఒక సాయంత్రం, అతను పద్దెనిమిది ఏళ్ల వయసులో,  ఇంటి వెనుక వాకిలిపై కూర్చున్నాడు. అతను లాప్ టాప్ లో తన పాఠ్యాంశాలను చదువుతున్నాడు. అప్పుడు అతను అడవిలో కదలికను గమనించాడు.

” ఒకవేళ చంద్రిక వచ్చిందేమో?”అతను అనుకున్నాడు.

తన ల్యాప్‌టాప్‌ను టేబుల్ మీద పెట్టి, అడవి లోకి పరిగెత్తాడు.  దూరంలో అతను ఆమెను చూశాడు. ఆమె కొంచెం పెద్దది అయింది.   ఆమెను చూడటం అతనికి ఎనిమిది సంవత్సరాల వయస్సులో ఉన్నదానికంటే ఇప్పుడు  చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపింది. అతను  ఆమె వైపు నడిచాడు.

ఆమె నల్లటి జుట్టు ఇప్పటికీ ఆమె ముఖాన్ని సరిగ్గా కనబడనీయ లేదు.  ఆమె ముఖం ఇప్పటికీ అతనికి గుర్తుకు వచ్చే  అదే చిరునవ్వుతో వెలిగి పోతోంది.

“హాయ్,” ఆమె దాదాపు అరిచింది.

 ” నువ్వు  నన్ను చూస్తావని నేను అనుకున్నాను”

అతను తన చేతులను ఆమె చుట్టూ విసిరి ఆమెను కౌగిలించుకున్నాడు. ఆ హఠాత్పరిణామానికి ఆమె కొంచెం బెదిరింది.

“ఎక్కడున్నావ్ ఇప్పటి దాకా నువ్వు? ఇంతకాలం నువ్వు నన్ను ఎందుకు చూడలేదు? ”  చంద్ర అవేమి పట్టించుకోకుండా ప్రశ్నల వర్షం కురిపించాడు.

“నన్ను క్షమించు,” ఆమె అతని చేతిని గట్టిగా పట్టుకొని చెప్పింది.

“నా తల్లిదండ్రులు నన్ను బయటికి వెళ్ళ నివ్వలేదు. స్కూలు, ఇల్లు ఈ రెండు తప్ప నాకు ఏమీ తెలియకుండా చేసారు”

 “ఆ రోజు నన్ను దెయ్యం లాగా మీ నాన్న నన్ను చూశాడు” చంద్ర అన్నాడు.

ఆమె నవ్వింది.

 “నేను చాలా మందిని చూడను” ఆమె అంది.

“నువ్వు ఎలా ఉన్నావ్,” ఆమె అడిగింది.

వారు అడవి లోపలికి నడవడం ప్రారంభించారు. చెట్ల ఆకులు  సూర్య కాంతి ప్రకాశాన్ని తీసుకున్నాయి.

 “ప్రతి సంవత్సరం నేను నిన్ను చూస్తానని ఆశతో వున్నాను” చంద్ర నిదానంగా అన్నాడు.

“నేను పదో తరగతి వరకే చదివి ఆపేసాను. మా నాన్న కాలేజీకి నా చేత ప్రైవేటుగా కట్టించాడు” ఆమె చెప్పింది.

ఆమె ఆగి అతని వైపు చూసింది. “అసలు కాలేజీకి  వెళ్లడం అంటే ఏమిటి?”

అతను తన తరగతుల గురించి, తన అభిమాన గురువు గురించి చెప్పాడు. తను జర్నలిస్టుగా ఉండమని ప్రోత్సహిస్తున్న వాళ్ళ నాన్న గురించి చెప్పాడు.  మునుపటి మాదిరే చంద్రిక శ్రద్ధతో అతని మాటలు వింది.

జర్నలిజం చదవడం కోసం, కాలేజీ   తరువాత నగరానికి వెళ్లాలన్న తన కల గురించి అతను ఆమెకు చెప్పాడు.

“నేను నగరాన్ని చూడాలని కోరుకుంటున్నాను,” ఆమె చెప్పింది.

“అది చాలా మనోహరంగా అనిపిస్తుంది.”

“కలిసి వెళ్దాం,” చంద్ర చెప్పాడు. 

ఆమె నేల వైపు చూస్తుండగానే ఆమె చిరునవ్వు మాయమైంది.

 “నేను అలా చేయలేను,” ఆమె చెప్పింది.

 “నేను నీతో మాట్లాడుతున్నానని నా తల్లిదండ్రులకు కూడా తెలియదు. వారు నన్ను నగరానికి వెళ్లనివ్వరు. ”

అతను సంవత్సరాల తరబడి ఆమెను చూడకపోయినా, వారు ఎప్పటికీ దూరంగా ఉండరని అనిపించింది. అయినప్పటికీ, అతను చంద్రిక చేతిని తన చేతుల్లోకి తీసుకోవడంతో వారి సంబంధం మరో విధంగా మారుతున్నట్లు వారికి అనిపించింది.

“నేను నీ కోసం వెతకటం ఎప్పుడూ ఆపలేదు.” చంద్ర అంటుంటే, ఆమె అతని చేతిని మళ్ళీ గట్టిగా నొక్కింది.

మరుసటి సంవత్సరం, వారు ఒకరినొకరు అడపాదడపా చూసుకున్నారు.  అయినప్పటికీ చంద్ర ఇష్టపడేంత తరచుగా కాదు. చంద్రిక తన తల్లిదండ్రుల గురించి మాట్లాడలేదు. కాని వారు ఆమెను ఎక్కువ సమయం లోపల ఉంచారని అతను తెలుసుకున్నాడు. అతను ఆమె పట్ల జాలిపడ్డాడు.

ఆమె చంద్రకి ఒక పక్షిలా కనిపించింది. ఎగరడానికి రెక్కలను ఉపయోగించడం ఆమెకు నిషేధించబడింది. ఆమె తల్లిదండ్రులు ఎందుకు అలా నియంత్రిస్తున్నారో అతనికి అంతు చిక్కెదీ కాదు.

వారు కలిసి ఉన్నప్పుడు,  అతను ఆమెను చాలాసార్లు నగరానికి రావాలని కోరాడు. కాని ఆమె రాలేనని  చెప్పేది.

అతని 21 పుట్టినరోజు నాడు,  వారు తమ మునుపటి అన్వేషణలలో కలుసుకునే చోటులో  కలుసుకున్నారు. వారు ఒకరినొకరు కొద్దిసేపు చూసుకున్నారు. పెద్ద చెరువు పక్కన పెద్ద బండరాయి పక్కన కుర్చున్నారు. అక్కడ వారు తరచూ కలిసి కూర్చుని, నక్షత్రాలను చూస్తూ ఉంటారు.

ఆమె చేతిని గట్టిగా పట్టుకుంటూ, అతను ఆమె దగ్గరికి వెళ్ళాడు.

 “నువ్వు చివరకు నాతో నగరానికి రాబోతున్నావ్.” అతని ప్రేమ నిండిన స్వరంతో అన్నాడు.

ఆమె నవ్వింది.

 ” నా పుట్టినరోజుకు నువ్వు ఇచ్చే కానుక ఇదే.” అతను ఆశతో చెప్పాడు.

అతని కళ్ళు ఆమెను కలుసుకున్నాయి.

 “కాబట్టి నీ పుట్టినరోజు కోసం నేను ఏమి చేయాలి?”

ఆమె నిలబడింది.

 “నేను నీకు చూపించదలుచుకున్న ప్రదేశం వుంది .”

చంద్రిక అతన్ని ఇంతకు ముందెన్నడూ లేని ఎత్తైన కొండకు తీసుకు వెళ్ళింది. సూర్యుడు అస్తమించటం ప్రారంభించాడు.  దాని నారింజ రంగు కాంతిలో  దూరంలోని ఎత్తైన భవనాలతో వున్న నగరం కనబడింది. కొండ కింది అంచు దగ్గర, పెద్ద చెరువు   అడవిని వేరు చేసింది. 

నగరం చంద్రిక ఇంటికి చాలా దగ్గరగా ఉందని అతను ఎప్పుడూ గ్రహించలేదు. ఆ దృశ్యం అతన్ని ఊపిరి పీల్చుకొనీకుండా చేసింది. అతను సంభ్రమాశ్చర్యాలతో నగరం వైపు అలాగే చూస్తూ ఉన్నాడు. చంద్రిక పక్కన ఉండటం వల్ల అతనికి నగరం మరింత కొత్తగా, అందంగా, అద్భుతంగా అనిపించింది.

“నా పుట్టినరోజు నాడు నాకు ఇది అందమైన అనుభూతి  ” అని చంద్ర, ఆమె ఆలోచనలకు అంతరాయం కలిగించాడు.

 ఆమె చూపులను చంద్ర కళ్ళు కలుసుకున్నాయి.

 “ఏమిటి?” ఆమె నవ్వుతూ ఉంది.

 “నీ ముఖం,  ఆ రూపం,” తన చెప్పబోయాడు. కానీ అతని మాటలకు ఆమె అడ్డుకట్ట వేస్తూ 

“ నువ్వు  నగరాన్ని ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు తెలుసు. నేను ఈ స్థలాన్ని చూసినపుడు, నేను నిన్ను ఇక్కడికి తీసుకురావాలని చాలాసార్లు అనుకున్నాను. కానీ ఇప్పుడే కుదిరింది”

ఆమె  అతని భుజం మీద తల పెట్టింది. అతను ఆమె తల పైభాగంలో ముద్దు పెట్టుకున్నాడు. ఆమె జుట్టు  మృదుత్వాన్ని,  ఆమె  దగ్గర వచ్చే అడవి వాసనను అతను అనుభవించాడు.

అతను ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు.

“నేను నిన్ను ప్రేమిస్తున్నాను, చంద్రికా ” అతను అన్నాడు. అతను చెప్పిన వెంటనే 

ఆమె ముఖం వెలిగిపోయింది.

 “నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను.” ఆమె విరబూసిన పువ్వు  మళ్లే చెప్పింది.

 ఆమె రెండు చేతులను అతనిలోకి తీసుకున్నాడు. “నేను నా జీవితాంతం నీతో గడపాలనుకుంటున్నాను. నన్ను పెళ్లి చేసుకో. మనం కలిసి నగరానికి వెళ్తాము. ”

ఆమె చేతులు తీసివేసింది. 

అతను నమ్మలేకపోయాడు.

 “నువ్వు  కూడా ప్రేమిస్తున్నావని నువ్వు చెప్పావు కదా” 

ఆమె కొండ అంచు వరకు నడిచింది. అతను ఆమె వెంటే వెళ్ళాడు.

“నేను చనిపోతున్నాను,” ఆమె చెరువు నీటిని చూస్తూ చెప్పింది. ఆమె మాటలు అతన్ని తీవ్ర వేదనకు గురించేసాయి.

ఆమె కళ్ళలో విచారంతో అతని వైపు తిరిగింది.

 “నాకు ఎక్కువ సమయం లేదు.  నాకు ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చింది.   డబ్బు ఇచ్చి ఆపరేషన్ చేసే శక్తిసామర్థ్యాలు మా తల్లిదండ్రులకు లేవు ” ఆమె విరిగిన స్వరంతో చెప్పింది.

లాంకో ఇండస్ట్రీస్ లిమిటెడ్ ని శ్రీకాళ హస్తి పైప్స్ లిమిటెడ్ అని కూడా పిలుస్తారు. 1991 లో కోర్ఫ్ – జర్మనీ  సాంకేతిక సహకారాన్ని ఉపయోగించి పిగ్ ఐరన్ తయారీ కోసం దీన్ని స్థాపించారు. ఉత్పాదక కర్మాగారం శ్రీకాళహస్తి పట్టణానికి సమీపంలో ఉన్న పచ్చని పల్లె  రాచగున్నేరి గ్రామ సమీపంలో ఉంది.

 2014 లో కంపెనీ పేరును లాంకో ఇండస్ట్రీస్ నుండి శ్రీకాళహస్తి పైప్స్ లిమిటెడ్ గా మార్చారు. ఈ కర్మాగారంలోనే సిమెంట్ ని ఉత్పత్తి చేస్తారు.

సిమెంటులో సున్నం, సిలికాతో పాటు వివిధ రకాల రసాయనాలు ఉంటాయి. ఇటువంటి రసాయనాలు శ్వాసకోశ రుగ్మతలతో పాటు వివిధ ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. సిమెంట్ కార్మికులకు చాలా ముఖ్యమైన వృత్తిపరమైన ప్రమాదాలు అలెర్జీ, శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించిన సమస్యలే.

హెమాటాక్సిలిన్, ఎయోసిన్ స్టెయినింగ్ ద్వారా సైటోలాజికల్ విశ్లేషణ కోసం కఫం నమూనాలను పరిశీలిస్తే చంద్రికలో ఊపిరి తిత్తుల క్యాన్సర్ ఉన్నట్టు తెలిసింది.

“నువ్వు ఎందుకు నాకు చెప్పలేదు? నీకు ఎంతకాలం నుండి ఈ విషయం తెలుసు? ” అతని గుండె అతని ఛాతీలో నుండి ఉద్వేగంతో బయటికి వచ్చినంత పని అయింది.

“నువ్వు నన్ను భిన్నంగా చూడాలని నేను కోరుకోలేదు. నువ్వు నా కోసం పోరాడాలనుకోవడం ద్వారా మన సంబంధం గట్టి పడాలని నేను కోరుకోలేదు. ”

అతను ఆమెను పట్టుకుని దగ్గరకు లాగాడు. అతని శరీరం వణుకుతున్నప్పుడు అతని కళ్ళు కన్నీళ్ళతో నిండిపోయాయి.

 “నేను నిన్ను చనిపోనివ్వను.”

ఆమె అతన్ని దూరంగా నెట్టి అతని కళ్ళలోకి లోతుగా చూసింది. ఒక క్షణం ఆమె ఏమీ మాట్లాడలేదు, సరైన పదాల కోసం వెతుకుతున్నట్లుగా.

“నా పద్దెనిమిదవ పుట్టినరోజు దాటి నేను బ్రతకలేనని  డాక్టర్లు అంటున్నారు. వారు ఏమీ చేయలేరు. ” చంద్రిక ఏడుస్తూ చెప్పింది.

అతనికి ఏమి చెప్పాలో తెలియదు. ఆమెకు ఒక సంవత్సరం మిగిలి ఉండవచ్చు. అతను గత దశాబ్దం అంతా ఆమెతో కలిసి గడిపాడు. ఆమె లేని జీవితాన్ని అతడు ఊహించలేక పోతున్నాడు.

 ఆమె అతని చెంపపై చేయి పెట్టింది.

“నగరానికి వెళ్ళు. పెళ్లి చేసుకో. నీ కుటుంబంతో సంతోషంగా ఉండు”

కన్నీళ్లతో పోరాడుతున్న చంద్ర గొంతు పూడుకు పోయింది. 

 ఆపరేషన్  కు సుమారు 20 లక్షల వరకు ఖర్చు అవుతుందనే విషయం చంద్రిక తల్లిదండ్రుల ద్వారా తెలుసుకున్నాడు. కానీ  అతని దగ్గర అంత డబ్బులేదు. ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఆమె బతుకుతుందో లేదో కూడా తెలియదని డాక్టర్లు చెపుతున్నారు. చంద్ర నిస్తేజంతో  జీవితాన్ని గడపటం ప్రారంభించాడు. మొట్టమొదటిసారిగా తన పేదరికం గురించి తనే తిట్టుకున్నాడు.

చంద్రిక, చంద్ర వాళ్ళ నాన్నలు కూడా అదే సిమెంట్ ఫ్యాక్టరీ లో పని చేస్తున్నారు. వాళ్లకు, వాళ్ళతో పాటు పనిచేసే కార్మికుల్లో ఎక్కువమంది దగ్గు, ఉబ్బసం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వంటి వివిధ రకాల శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు.

 సిమెంట్ ఫ్యాక్టరీ కి దగ్గరగా కార్మికుల ఇల్లు ఉండటం వల్ల కుటుంబ సభ్యులు అలెర్జీ, రక్తపోటు, డయాబెటిస్, వెన్నునొప్పి వంటి ఇతర సమస్యలతో కూడా బాధ పడుతున్నారు.  

సిమెంట్ పరిశ్రమ ఉత్పత్తి చేసే పొగ, ధూళి వివిధ రకాల వ్యాధికారక ఉత్పత్తికి కారణమవుతాయి. సిమెంట్ దుమ్ములో కాల్షియం ఆక్సైడ్, సిలికాన్ ఆక్సైడ్, అల్యూమినియం ట్రైయాక్సైడ్, ఫెర్రిక్ ఆక్సైడ్, మెగ్నీషియం ఆక్సైడ్, ఇసుక, ఇతర మలినాలు ఉంటాయి.

 ఆ రోజు ఆమె పుట్టినరోజు.  ఉదయాన్నే అసాధారణంగా అనిపించే అడవి గుండా చంద్ర పరుగెత్తాడు. అతను నిశ్శబ్దంగా ఉన్న ఆమె ఇంటికి చేరాడు.  అతను ఇంటి తలుపు తట్టి ఆమె కోసం వేచి ఉన్నాడు. ఆమె ఏ నిమిషం అయినా బయటకు వస్తుందని ఆశించాడు.  నిమిషాలు గంటలుగా మారుతున్నాయి.

ఆ ఆలస్యపు బరువును అతను గుండెల్లో అనుభవించాడు. మళ్ళీ ఇంకో సారి గట్టిగా పేరు పెట్టి పిల్చాడు. ఎవరూ సమాధానం చెప్పలేదు. అతను మరింత శక్తితో తలుపును తోశాడు.

చంద్రిక వాళ్ళ నాన్న తలుపు తెరిచాడు.

“నేను చంద్రికను చూడాలనుకుంటున్నాను. ఆమె ఆరోగ్యం గురించి నేను తెలుసుకోవాలి. ”

“చంద్రిక ఇక్కడ లేదు,” ఆ వ్యక్తి బదులిచ్చాడు.

“నేను ఆమెను చూడాలి,” అతను ఇంట్లోకి బలవంతంగా వెళ్తూ చెప్పాడు.

ఆ వ్యక్తి వెనక్కి తగ్గాడు.  చంద్రిక తల్లి భయపడి పక్కన నిలబడి పోయింది.

 “నేను ఎవరినీ బాధపెట్టడానికి ఇక్కడకి రాలేదు,”  అతను చెప్పాడు.

చంద్ర గదిలోకి నడిచాడు. ఆ దృశ్యం అతని మనుసును దాదాపుగా విరిచింది. చంద్రిక అపస్మారక స్థితిలో మంచం మీద వుంది.  ఆమె శరీరం బాగా  సన్నబడింది.

 ఆ గదిలో వింతగా మెరుస్తున్న నీలిరంగు బుల్బు వుంది. అతను ఆమె దగ్గరికి వచ్చి ఆమె చేతిని తీసుకున్నాడు.

 “ఇప్పుడు ఎలా ఉంది”

 చంద్రిక ‘పరవాలేదు’ అన్నట్టు నీరసంగా తల ఊపింది. ఆమె కళ్ళు మత్తుతో మూతలు పడుతున్నాయు.

  “ఆమె చనిపోదు,” చంద్ర ఆవేదనతో అరిచాడు. ఆ మాట ఎవరికి చెపుతున్నాడో కూడా తెలియని వింత పరిస్థితిలో అతను వున్నాడు.

అతను ఆమెను మొదటిసారి చూసిన తీరు అతనికి జ్ఞాపకం వచ్చింది. ఆమె అతన్ని చూడన్నట్టుగా, ఆమె అతన్ని చూచిన తీరు. అతను ఆమె స్పర్శను, మొదట ఆమె జుట్టు మీద ముద్దుపెట్టుకున్న  తీరును గుర్తు చేసుకున్నాడు.

 ప్రశాంతంగా కనిపించే చంద్రిక ముఖం వైపు చంద్ర చూశాడు. చంద్రికను అమాంతం చంద్ర ఎత్తుకుని ఇంటి బయటకి నడిచాడు. అతని అడుగులు ఫ్యాక్టరీ వైపు నడిచాయి. అప్పుడికే అక్కడ గుమిగూడిన కార్మికులు చంద్ర వెనకనే ఆవేశంగా నడవడం ఆరంభించారు.

Leave a Reply