కలంతో

కరచాలనమై

అక్షరాలను

అల్లుకుపోతూ

అజ్ఞాతంలో

దశాబ్దాలు గడిచిపోయాయి

సింహవలోకనంలో

గమనా గమనమై

నైనాగా

ఉప్పెనైపోతూ

ప్రజలు అజేయులంటూ

రెండుపాదాలు

చివరిదాక నడిచాయి

చీకటిని శిథిలంచేసే

సూర్యోదయకిరణాల కోసం

గుండెలుమీద పెంచుకున్న బిడ్డలకు

నడకనేర్పిన సింధూరాలు

నాలుగుసింహాలు

నాలుగుదిక్కులు

దారులుమూసి

ట్రిగ్గరమీద వేలుపెట్టినా

రంగులు మార్చే

ఖాకీలు

కనికరమైనట్టు

నోట్లకట్టలపై నడిపిస్తామన్నా

భయమైపోయి

కాసులముందు

కన్నీరై

తలవంచని 

తల్లీ లలితమ్మ

Leave a Reply