అవును

నేనెవరిని

అందరి లాగే నేను ఐనా

నేనంటే గిట్టదు 

నా ముస్తాబు నా ఇష్టం

రకరకాల రంగుల్లో నాకు నచ్చిన రంగు

తొడుక్కుంటా

నాలోని భావాలు నలుగురిలో పంచాలనుకుని

రూపు దిద్దుకుని జనంలోకి వస్తా

నా ఆశయాలు వేరు

నా ఆదర్శాలు వేరు

అందరూ పాటించాలనే నియమం లేదు

కొరడా పట్టుకుని ఝుళిపించనూ లేదు

నా మానాన నేను కమ్మలతో కూర్పు

నన్ను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలనుకుంటే తప్పా?!

నా లోని ఒక్కో తెర

ఒక్కో కఠోర వాస్తవ దర్పణం

చరిత్ర నేటి తరానికవసరం

నన్ను స్వీకరిస్తారో త్యజిస్తారో

జనం ఇష్టం

నన్ను బైటికి రాకుండా చేసే

ప్రజాస్వామ్య దేశంలో రాచరికం మూలాలు

అడుగడుగునా 

నాలో ఏముంది

నా రంగు చూస్తేనే వణుకెందుకు

ఎవరి పంథా వారిదైనప్పుడు

నా పైనే ఆంక్షలెందుకు??

నాలోని ఒక్కో అక్షరం ముక్క

నిప్పు కణికై

జ్వాలౌతుందనే భయం

నేనెవరిని

నేనో ఎరుపు రంగు పుస్తకాన్ని

Leave a Reply