రక్తంరుచి మరిగిన
వలస రాబందులు
వర్గ సమాజానికి వకాల్త పుచ్చుకొని
రాజ్యం రక్షణే ధ్యేయంగా
మా విప్లవ కేంద్రాలకు
వలస సాచ్చాయి
“సమాధానో”ప్రహార దాడులలో
రణరక్కసి ధ్యేయంగా
రక్త దాహపు వేట
రాజ్యానికి పసందైన ఆట.
నేడు తెలంగాణ ఒక కాన్సన్ట్రేషన్ క్యాంప్
రాజ్య నిర్బంధ శిబిరం
40 ఏళ్ల ఆవల నుంచే
ఇక్కడ ఆ ఖాకీలకు
మా రక్తం శీతల పానీయం
మా శరీరపు మాంసపు ముద్దలు
పంచభక్ష పరమాన్నాలు కానీ
మా రక్తం నిరంతర ప్రవాహం
మా శరీరం అఖండితం
స్మశాన ప్రశాంతత కోసమని
హింస ప్రతి హింసల మధ్య
యుద్ధ ఛాయలలో
ఇప్పుడు
ఊరు ఒక చెరసాల
ఇల్లు ఒక బ్యారక్
మనిషి యొక నేరస్తుడే
ఇక్కడ సత్యం సమాధికై
ధర్మం నిర్మూలనకై జరిగే
లాకప్ హత్యలు
ఎన్ కౌంటర్ లతో
ప్రతిరోజు పరిఢవిల్లుతుంది
నేటి సాయుధ పహారాలో
దినమొక గండం పగలు ఒక రాత్రి
కాలం ఒక మృత్యువు