దేశమంతా నెత్తురు వాసన
ఆ మూల, ఈ మూల
దేశం నలుమూలల
ఏ మూల చూసిన
రక్తపు మరకలే
నెత్తురు వాసనే.

ఎనిమిదేళ్లుగా దేశంపై
తోడేళ్ల మంద
మూకుమ్మడి దాడి,
మతం పేరుతో
కులం పేరుతో
కూర పేరుతో
నీళ్ల పేరుతో
కత్తులు నెత్తుర్లు
పారుస్తున్నాయి.

గర్భాన్ని చీల్చి
పిండాలను పొడిచిన
శూలం
ఢిల్లీ పీఠంపై
రాజై కూసింది.
రాజ్యంలో రక్తం వాసన
మేఘంలా ముసురుకుంది.

One thought on “దేశమంతా నెత్తురు వాసన

Leave a Reply