ఇప్పుడు

దేశమే లేచి నిలబడి

గెలిచింది..

కాదు… కాదు

నాగలి కర్రు గెలిచింది 

మట్టి వ్యాపార కణమై

మనుషుల అస్తిత్వమే

నేరమైపోయిన చోట 

మ‌ట్టి గెలిచింది

ఆకలి నేరమై

హక్కులు అడగడం నేరమై

పోరాడడమే నేరమై

దర్యాప్తు సంస్థల  దాడులు

చేస్తున్న  చోట‌

ఎన్నెన్ని  కుట్రల వలయాలనో దాటి 

ఈ నేల గెలిచింది

ఇప్పుడు

గెలిచింది దేశం

కాదు.. కాదు

దేశాన్ని కర్రు నాగలి 

గెలిపించింది

గెలిచింది

ఈ దేశపు 

మట్టి మనిషి. 

Leave a Reply