ఆక్సిజన్ అందక
ఇప్పటికే చాలానదులు చచ్చిపోయాయి

అదేమిటోగాని
మృతజలాలలో
తేలియాడే తమశవాల్ని
ఎవరూ పట్టించుకోలేదు

నదులగోసల్ని ఎవరైనా విన్నారా
ఊపిరాడక
ఎంతెంత నరకయాతన అనుభవించాయో తెల్సుకున్నారా
మనకు ప్రాణప్రదమైన
మనకు బతుకునిచ్చిన
నదులిప్పుడు
పారే శవాలు
***
మృతనదుల్లో
శవాల్ని విడిచేస్తే
చేసిన నేరాలు కొట్టకుపోతాయా
నదులమీదుగా
తేలియాడే శవాల్లాగే
నేరాలు సైతం
కాలంనదిమీద తేలుతూ ఉంటాయ్

ఏదో ఒకరోజున
అన్ని నదులూ
ఆక్సిజన్ అందక
ఊపిరాగి చచ్చిపోతాయి
ఆపుడా మృతనదుల మీదుగా
నాగరికతల అస్థిపంజరాలు
తేలియాడుతూ పోయి
చీకటి సముద్రంలో కల్సిపోతాయ్

నదులకు
తామెప్పుడు చచ్చిపోతామో తెల్సు
ఆ వెంటే నాగరికత కూడా…

(  జసింతా కెర్ కెట్టా (ఆదివాసి యువతి ) గారికవితకు      
స్వేచ్ఛానువాదం……ఉదయమిత్ర )

Leave a Reply