** నా నగరం కోసం వెతుకుతున్నా.. ఎక్కడుందది ఎక్కడుండేదది జ్ఞాపకాలు మసక బారుతున్నాయ్ మస్తిస్కం మొద్దుబారి పోతున్నది అది గోద్రా మురికివాడల్లో ఉండే ది నర్మదా లోయలో తచ్చాడుతుండేది కాదు కాదు . అది హాశింపుర కాలువలో శవమై తేలి లోకాన్ని దిగ్భ్రాంతికి లోను చేసింది నెల్లి మారణకాండలో మౌనంగా దుఃఖించింది కాదు ,కాదు.. అది బస్తర్ మారణకాండలో కల్లోల కాలానికి సాక్షిగా నిలిచింది జీలం నది ఒడ్డున గాయాలతో సొమ్మసిల్లింది. అది కూచిబెదార్లో ఉండేది నంది గ్రామ్ లో ఉండేది జఫ్రాభాగ్, చాంద్బాగ్ ఎన్నని చెప్పను మర్చిపోతున్నా అలసిపోతున్నా నన్ను నేను నిలబెట్టుకోవడానికి నాతో నేను నిరంతరం యుద్ధం చేస్తున్నా... అందమైన జ్ఞాపకాలు ఒక్కటొక్కటి మాయమై నా మనో యవనిక మీద రక్తంతో తడిసిన తేదీలు ,సంవత్సరాలు, స్థలాలు రీళ్ళలాగ కదులుతున్నాయి . 2020 1947 19864 1968 1984 1992 2002 2007 1979 ఇంకా ఇంకా రికార్డు అవుతూనే ఉన్నాయి నా రక్తం ఈ పుణ్య భూమి మీద పాలకులకు పంటకాలువై పారుతూనే ఉంది అన్ని నగరాలు తుపాకీ మందు వాసనేస్తున్నాయి. ఖాకీల సైరన్లతో, ప్రజలహాహాకారాలతో అన్ని నగరాలు కలగల్సిపోయాయి . మతోన్మాద మహాసర్పం ఒక్కొక్క నగరాన్నే మింగేస్తుంటే ఇంక నా నగరాన్ని ఎక్కడని వేదికేదీ.. **
మూలం ..మౌనిత ఆలం
స్వేచ్ఛానువాదం….ఉదయమిత్ర..