వాడు
ఆమెను అచ్చట పీఠమెక్కించి
మదంతో పేట్రేగుతున్నాడు
వీధుల్లో జనావాసాల్లో 

ఒక కూలి కూలి డబ్బులు అడిగితే
దౌర్జన్యం
కూలిపై మూత్ర విసర్జన
ఎక్కడిదా ధైర్యం?!
ఎవడ్ని చూసుకుని ఆ దుశ్చర్య?!
వాడు వాడి మను బంధువు కాబట్టే!

ఆమె ఆది వాసి
కూలి ఆదివాసి
ఆమెకీ పరాభవం
కూలికీ పరాభవమే
తేడా ఏం లేదు
అక్కడ కుర్చీ
ఇక్కడ నేల అంతే!!

చట్టం వాడికి చుట్టమే అవుతుంది
ఎవడు కాదన్నా!
ఫిర్యాదుకే భయ పడిన కూలి
ఇక రాబందుల బెదిరింపులతో హడలి పోవు

గోమూత్రం తాగే వాడు
గో మలాన్ని ముఖానికి పూసుకునే వాడు
అజ్ఞానం తో మౌఢ్యం తో రెచ్చి పోతుంటే
బహుజన మెదళ్లు వాడి ఉచ్చులో చిక్కుకుంటుంటే
తరాల అహంకారం ఇలాగే
నడి రోడ్డు పై
ఓ మనిషిపై ఉచ్చ పోసే స్థాయి కి!

మృగాల్లాంటి ఈ మనుషుల కంటే
ప్రకృతి మృగాలే నయమనుకుని 
వాటితో సావాసం చేస్తూ
పొట్టకూటి కోసం వలసొచ్చి
ఈ మృగాల బారిన

బలమైన చట్టాలు సైతం
మెజారిటీ ముందు ఓడిపోతుంటే
వాడు బలాదూర్ గా
నిస్సిగ్గుగా ఇలాగే తన పరంపర!
అంతిమ తీర్పు అంగచ్చేదనమే ! అప్రజాస్వామిక మైనా!!
అదే అమానవీయ ఘటనలకు తెర దించు!!

Leave a Reply