చాలా నిరాశ కు గురయ్యాను  కానీ , ఇలా  జరగదని  నేను అనుకోలేదు.

2020 లో  క్వీర్ జంటలు తమ వివాహ హక్కు ను డిమాండ్ చేస్తూ కొన్ని పిటిషన్ లు  వివిధ హైకోర్టులలో  వేసాయి. ఇటువంటి ఇరవై పిటిషన్లను  సుప్రీం కోర్టు  తనవద్దకు బదిలీ చేయించుకుంది. ఈ డిమాండ్ల రాజ్యాంగ బద్ధత  ఉన్నది లేనిది   పరిశీలించడమే ఆ బెంచ్ లక్ష్యం.

అనేక పిటిషన్ల నుంచి  ఒక ఇరవై పిటిషన్ల ను  ఒక దగ్గరకు తెచ్చారు.  అయితే ఆ పిటిషన్లలో చాలా వైవిధ్యం ఉంది. కొన్ని పిటిషన్లు  విదేశాల్లో జరిగిన తమ వివాహాన్ని  మన దేశంలో గుర్తించమని  కోరాయి. కొన్ని పిటిషన్ లు వారికి ఇతరత్రా అన్ని రకాల మద్దతు ఉన్నప్పటికీ  తమ వివాహ హక్కును  ప్రభత్వం  గుర్తించాలని కోరాయి.  కొన్ని పిటిషన్లు ప్రత్యేక వివాహ చట్టాన్ని సవరించాలని  కోరాయి.  మరికొన్ని పిటిషన్లు వ్యక్తిగత చట్టాలలో జోక్యాన్ని కోరుతున్నాయి . ఈ పిటిషన్లు  ఇప్పటికే దాఖలు అయినప్పటికీ , కొన్ని పిటిషన్లు  తరవాతి కాలంలో ఉద్యమానికి ప్రతిస్పందనగా  2023 ప్రారంభంలో  స్వలింగ వివాహాల కు అనుమతి కోరుతూ సుప్రీం కోర్టులో దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్ లలో  సాధారణ అంశం  కేవలం సిస్-హెట్ జంటలకు మాత్రమే వివాహాన్ని అనుమతించే వివక్షను గుర్తించడం.

మన న్యాయవ్యవస్థ  విషయానికి వస్తే ఎవరైనా కోర్టుకు వెళ్ళ గలరు , ఇప్పుడు అదే జరిగింది. తొలి దశలో వేసిన పిటిషన్ లు అన్నీ వ్యక్తిగత డిమాండ్లుగా  తమ వివాహ గుర్తింపును కోరుతూ వేసినవి లేక  వారి నిర్దిష్ట  వివాహ హక్కుకు  సంబంధించినవి.  ట్రాన్స్ జెండర్  సమూహం రోజువారీ ఎదుర్కొంటున్న సమస్యలు తెలియకుండానే ,  సిస్  క్వీర్ ల కు మద్దతుగా  పెద్ద ఎత్తున సాగిన క్వీర్ ఉద్యమం ఆశ్చర్యం కలిగించదు.  నా ఉద్దేశంలో  ఈ  ” హక్కుల” ప్రాజెక్ట్   కు    ఒక ఆకర్షణ ఉంది. అయితే ఈ ఆధునిక ఉదార ప్రజా స్వామ్యంలో  ఒక క్రమాన్ని అనుసరించ వలసి ఉంది. అందులో మొదటది స్వలింగ వివాహాలను  నేరంగా పరిగణించకపోవడం ,  వివాహాన్ని అనుమతించడం, దత్తత , విడాకులు ఇలా మిగతావి. ఆధునిక ఉదారవాద ప్రజాస్వామ్య రాజ్యాలు లేదా హక్కుల ప్రాజెక్ట్ లు  ఇప్పటికే జీవిస్తున్న క్వీర్ జంటల భవిష్యత్తుకు  హామీలు  ఇవ్వకపోవడం  వలన  అగమ్యగోచర పరిస్థితి ఏర్పడింది  . రానురాను   ప్రస్తుత వ్యవస్థలో  మనం   సంఘటితం కాలేకపోతున్నాం.  ఒకరికోసం ఒకరం మనం కోరుకున్నంత  గట్టిగా,  నిలబడాల్సినంతగా  నిలబడ లేకపోతున్నాం. మనమంతా ఒక సమూహం అనే భావన పెంచవలసి ఉంది.  అది మన సమూహం లోని  ప్రతి ఒక్కరి గొంతును విని , ఆ విన్నవాటి  నుంచి నిజంగా  ఒక సమూహంగా మనం  ఏమి కోరుకుంటున్నామో  నిర్వచించుకోవలసి ఉంది.  మనందరి సమిష్టి భవిష్యత్ కోసం   మనం చేసే సమిష్టి పోరాటం సుప్రీం కోర్టులో వ్యక్తిగతంగా మనం వేసిన పిటిషన్లకన్నా  చాలా భిన్నమైనది.

ఈ పిటిషన్ లలో ఒక పిటిషన్  ప్రత్యేకంగా  సమాన అబార్షన్  హక్కులను కోరింది. దానికి  ప్రధాన న్యాయమూర్తి   ప్రస్తుత CARA  నిబంధనలు ( దత్తత కు సంబంధించిన నిబంధనలు  )  వివక్షతో కూడుకున్నవని అంగీకరించారు. కానీ ఆయన బెంచ్ లో మైనారిటీ గా ఉన్నారు. ప్రధాన న్యాయమూర్తి చేసిన సిఫారసులను  మిగతా  న్యాయమూర్తులు అంగీకరించకపోవడం వలన అవి అమలులోకి రావు.

తీర్పులోని సానుకూల అంశాలు ఏమంటే  ఈ తీర్పు  శక్తి వాహిని మార్గదర్శకాలను  పునరుద్ఘాటించింది . ఇవి ట్రాన్స్ / క్వీర్  వ్యక్తులు తాము పుట్టిన   కుటుంబం నుంచి  ఎదుర్కుంటున్న హింస నుంచి రక్షణ కు తోడ్పడతాయి. స్వతంత్రంగా బతక దలుచుకున్న వారికి , ఇంటి నుంచి వెళ్లిపోదామనుకుంటున్న వారికి , హింసను ఎదుర్కోవడానికి   ఉపయోగకరం. ఈ తీర్పు  ఏ రకమైన   లైంగికత / లింగ మార్పిడి  చికిత్సలను  రాజ్యాంగ విరుద్ధమైనదిగా  ప్రకటించింది.

భిన్న లైంగిక సంబంధాలలో ఉన్న ట్రాన్స్ వ్యక్తులకు  ఈ నిబంధన ఇప్పటికే ఉంది . సుప్రీం కోర్టు ఆ నిబంధనను సమర్థించింది.

సుప్రీం కోర్టు తనకు శాసనాలు చేసే అధికారం లేదని స్పష్టం చేసింది .. అప్పుడు ఈ విషయంలో శాసన వ్యవస్థలే ఇందుకు సంబంధించిన విధాన రూపకల్పన , చట్టాలు చేయవలసి ఉంటుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి , త్వరలో పార్లమెంట్ ఎన్నికలు కూడా  జరగనున్న నేపథ్యంలో  ఈ సమస్యలను  ఈ అంశాలతో ముడిపడిన అందరి దగ్గరకు తీసుకువెళతాం.

One thought on “పిటిషన్ల కన్నా సమిష్టి పోరాటం ముఖ్యం

  1. Why politics ??they need to recognize those marriages —not a big issue
    ————————————
    BUCHI reddy gangula

Leave a Reply