పోతూ పోతూ
మనం
ఇంత ఆస్తినీ
కాసిన్ని జ్నాపకాల్నీ
వారసత్వంగా ఇచ్చి
చరిత్ర మడతల్లో అంతర్ధానమౌతాం

పోతూ పోతూ
అతడు
శోకతప్త ఇంద్రావతి నీ
రగులుతున్న అడవినీ
శాంతి కోసం యుద్ధాన్నీ
వారసత్వంగా ప్రకటించి వెళ్ళాడు..

ముఖం లేనివాళ్ళ ముఖమై
గొంతులేనివాళ్ళ గొంతై
అనాది ఆదివాసీ ఆర్తనాదమై
మిగలాల్సిందేదో
తగలబెట్టాల్సిందేదో
ప్రకటించి వెళ్ళాడు..

అతణ్ణి స్మరించడమంటే
గాయపడ్డ పావురాన్ని
ప్రేమగ హత్తుకోవడమే
గడీల మీదకు
ఫిరంగులు పేల్చడమే..
నూతన మానవావిష్కరణకు ఎదురేగడమే


15-09-21

Leave a Reply